లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు. రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట తొలి సెషన్ 34వ ఓవర్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌కు అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్లాడు.
అందులో బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8(అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు. దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్‌లో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.
చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా
Comments
Please login to add a commentAdd a comment