Oval Test
-
టీమిండియా గెలుపు.. నాగిని డ్యాన్స్‌తో ఖుషీ చేసుకున్న మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ: ఓవల్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్‌ను హోరెత్తించగా.. భారత అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. भाई लोग आप की फरमाइश पे | Anything for an India victory, no matter how awkward :) pic.twitter.com/aSgGA1pUQE — Mohammad Kaif (@MohammadKaif) September 7, 2021 ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. నాగిని డ్యాన్స్ వేస్తూ టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. "టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు.. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. కైఫ్.. టీమిండియా విజయాన్ని వంద శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండయా157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్ -
ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్
లండన్: ఓవల్ టెస్ట్ విజయం అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగల్లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో పేక మేడలా కుప్పకూలుతున్న జట్టును శార్దూల్ తన మెరుపు అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌తో కలిసి అతను నెలకొల్పిన శతక భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు వేసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన రోరీ బర్న్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు తెరదించిన శార్దూల్.. అత్యంత కీలకమైన జో రూట్ వికెట్‌ను కూడా పడగొట్టి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. ఇదిలా ఉంటే, ఓవల్ టెస్ట్ తర్వాత రాత్రికిరాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నశార్డూల్ ఠాకూర్ కూడా చాలామంది స్టార్ క్రికెటర్లలాగే ఎన్నో కష్టాలు దాటి ఈ స్థాయికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో గాయాలతో సతమతమయ్యి, భారీగా బరువు పెరిగిన ఇతను.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. తన బర్త్ డే నెల కలిసొచ్చేలా మొదట్లో జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగిన శార్దూల్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ‘నీ ముఖానికి అంత సీన్ లేదంటూ' ఘాటు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, స్వతాహాగా సచిన్ అభిమాని అయిన శార్దూల్.. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించి తన జెర్సీ నెంబర్‌ను 54గా మార్చుకున్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన అనంతరం శార్దూల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏ అభిమానుల చేత ట్రోలింగ్‌కు గురయ్యాడో వారి చేతనే ప్రస్తుతం శభాష్ అనిపించుకున్నాడు. అతని ఆరాధ్య దైవమైన సచిన్ కూడా అతన్ని ప్రశంసించడంతో శార్దూల్ ఆనందానికి అవధుల్లేవు. చదవండి: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్, లీచ్ రీ ఎంట్రీ -
టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్ మాజీ సారధి..
లండన్: టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి క్రికెట్ అభిమానులచే చివాట్లు తింటున్నా తీరు మార్చుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖత మైఖేల్ వాన్.. తాజాగా మరోసారి కోహ్లి సేనపై తన అక్కసును వెల్లగక్కాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లంతా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్, ఏబీ డివిలియర్స్, సెహ్వాగ్, షేన్ వార్న్, గంగూలీ ఇలా చాలా మంది లెజెండరీ క్రికెటర్లు కోహ్లి సేనను ఆకాశానికెత్తుతున్నారు. అయితే ఇది మింగుడు పడని మైఖేల్ వాన్.. గంగూలీ చేసిన ఓ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ, టీమిండియాను పరోక్షంగా ఎగతాళి చేశాడు. In Test cricket .. not White ball cricket 👍 https://t.co/t5M3HQTB1c — Michael Vaughan (@MichaelVaughan) September 6, 2021 వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన అనంతరం టీమిండియాను అభినందిస్తూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు. భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉందని, అతిపెద్ద వ్యత్యాసం ఒత్తిడిని అధిగమించడంలో ఉందని, ఈ విషయంలో భారత క్రికెటర్లు ఇతరులతో పోలిస్తే ఎన్నో రేట్లు మేలని ట్వీటాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఇంగ్లండ్ మాజీ సారధి తనకు మాత్రమే సొంతమైన వెటకారాన్ని ప్రదర్శిస్తూ టీమిండియాను కవ్విస్తున్నట్లు బదులిచ్చాడు. గంగూలీ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. 'టెస్ట్‌ల్లో మాత్రమే, వైట్ బాల్ క్రికెట్లో కాదు' అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశాడు. దీంతో అతనిపై టీమిండియా అభిమానులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. సోషల్‌మీడియా వేదికగా ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి వాన్.. టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కోహ్లి సేన స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందంటూ ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. అయితే వాన్ ఇలాంటి కామెంట్లు చేసిన ప్రతిసారి టీమిండియా రెట్టింపు కసితో ఆడి విజయాలు సాధిస్తూ వస్తుంది. చదవండి: భూగ్రహం మొత్తంలో టీమిండియా కెప్టెన్‌కు మించినోడే లేడు: షేన్ వార్న్ -
భూగ్రహం మొత్తంలో కోహ్లిని మించినోడే లేడు: షేన్ వార్న్
లండన్: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా చేరాడు. తొలుత ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించిన వార్న్.. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు. Congratulations .@imVkohli & the entire Indian team on another terrific win. What you guys have all achieved together over the last 12 months is absolutely magnificent ! Clearly the best test team in the world & that title is thoroughly deserved too ! Long live test cricket ❤️❤️ — Shane Warne (@ShaneWarne) September 6, 2021 'మరో అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గత ఏడాది కాలంగా మీరు జట్టుగా సాధించిన విజయాలు న భూతో న భవిష్యత్. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ టెస్టు జట్టు. ఇందుకు మీరు మాత్రమే నిజమైన అర్హులు. లాంగ్ లివ్ టెస్ట్ క్రికెట్' అంటూ వార్న్ ట్వీట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓవల్ టెస్ట్‌లో కోహ్లి భారత జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు. కోహ్లి.. టెస్ట్ క్రికెట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల సాంప్రదాయ ఫార్మాట్ స్థాయి పెరిగిందని, అతని సారధ్యంలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో పవర్ హౌస్‌గా మారిందని ప్రశంసించాడు. టెస్ట్ క్రికెట్ పట్ల టీమిండియా కెప్టెన్‌కున్న ప్యాషన్ అతన్ని భూగ్రహంలోనే అత్యుత్తమ ఆటగాడిగా మార్చిందని ఆకాశానికెత్తాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 157 పరుగుల తేడాతో ఓటమిపాలై 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్ -
అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ సహచర క్రికెటర్, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. తుది జట్టులో యాష్‌కు స్థానం కల్పించకపోవడంపై జరుగుతున్న అనవసర రాద్దాంతం నేపథ్యంలో మిస్టర్ 360 ఆటగాడు ఈమేరకు స్పందించాడు. ఈ విషయమై టీమిండియా అభిమానులు ఆందోళన చెందకుండా, కోహ్లి సేన సాధించిన విజయాలను ఆస్వాదించాలని సూచించాడు. కెప్టెన్సీ విషయంలో కోహ్లి సూపర్ అని ఆకాశానికెత్తాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా దక్కలేదు. నాలుగు టెస్ట్‌ల్లో యాష్‌కు నిరాశే ఎదురైంది. As “spectators” of Test Cricket, just stop worrying about team selection and other nonsense and start appreciating the competition, passion, skill and patriotism unfolding in front of your eyes. You’re missing a good game!— AB de Villiers (@ABdeVilliers17) September 6, 2021 ఓవల్ మైదానంలో అశ్విన్‌కు మంచి రికార్డు ఉండటంతో నాలుగో టెస్ట్‌లో అతనికి చోటు ఖాయమేనని అంతా భావించారు. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ మాత్రం అశ్విన్‌ను కాదని జడేజావైపే మొగ్గుచూపాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్ కోటాలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజు మ్యాచ్ భారత్‌వైపు మళ్లే వరకు విమర్శలు కొనసాగించారు. అశ్విన్ ఉంటే భారత్ విజయం సులువయ్యేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: టీమిండియా డాషింగ్ క్రికెటర్ నోట పవర్ స్టార్ పాపులర్ డైలగ్.. -
మ్యాచ్ గెలిపించినా అక్షింతలు తప్పలేదు.. టీమిండియా కెప్టెన్‌పై బీసీసీఐ ఆగ్రహం
లండన్: 50 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఓవల్ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ జట్టు సారధి విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు ముందు వీరు బయో బబుల్ నిబంధనలను ఉల్లఘించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లితో పాటు మరికొందరు టీమిండియా సభ్యులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే తొలుత రవిశాస్త్రి, ఆతర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కరోనా బారిన పడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలినా కోహ్లి సహా ఇతర ఆటగాళ్లకు మాత్రం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడానికి(బయో బబుల్ నిబంధనలకు విరుద్ధంగా) భారత బృందం.. బీసీసీఐ అనుమతి కోరలేదని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్న బోర్డు.. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వీరి వివరణ కోరిన బీసీసీఐ.. కోహ్లిని సున్నితంగా మందలించినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ కరోనా బారిన పడిన తర్వాత బోర్డు సెక్రటరీ జై షా ఆటగాళ్లను అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినప్పటికీ భారత బృందం బయో నిబంధనలు ఉల్లంఘించి అజాగ్రత్తగా వ్యవహరించడంతో బీసీసీఐ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 50 ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆతిధ్య జట్టుపై 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 210 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ శతకంతో రాణించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. చదవండి: థాంక్యూ బుమ్రా.. బెయిర్‌స్టోను డకౌట్ చేశావ్: జార్వో సంబరం -
ఇదీ ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితి.. అంతేగా.. అంతేగా!
లండన్: ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించిన టీమిండియా పై ట్విటర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు, కోహ్లి సేనను అభినందిస్తున్నారు. అభిమానులు చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్.. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లును కొనియాడతూ ట్వీట్ చేశారు. మరో భారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ .. భారత్‌కు ఈ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశాడు. This is a very special Test Match win. After being 127/7 on the first day, not many teams can make a comeback and win a away test the way Team India have done. That is why this is a very special Indian Team. Congratulations to everyone for playing their part in a memorable win. pic.twitter.com/9XDJCCrAwC— VVS Laxman (@VVSLaxman281) September 6, 2021 భయం లేదు.. బెరుకు లేదు.. కలిసికట్టుగా ఏదైనా సాధిస్తుంది.. అదే టీమిండియా అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ట్వీట్ చేశాడు. Individual commitments to a group effort. That’s the definition of this Team. This is Team India. Absolute Fearless. 🇮🇳💪 pic.twitter.com/9iRxyAvAfF— Yuzvendra Chahal (@yuzi_chahal) September 6, 2021 ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ మరోసారి తనదైన శైలిలో ట్వీటాడు. నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల పరిస్థితి ఇదీ అన్నట్లుగా.. ఓ మీమ్‌ను పంచుకున్నాడు. The Angrez this series😁 #ENGvIND pic.twitter.com/xFRejslJlw — Wasim Jaffer (@WasimJaffer14) September 6, 2021 What an incredible comeback by India after the first day. Shardul Thakur and Rohit Sharma were the standout performers and the bowlers were terrific especially in the second innings. A win to remember #ENGvIND pic.twitter.com/gOcUJa6fT8 — Venkatesh Prasad (@venkateshprasad) September 6, 2021 -
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఐదో రోజు హైలైట్స్ ఇవే
లండన్: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులకే కూప్ప కూలింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. 127 పరుగుల సాధించి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
టీమిండియా ఘన విజయం
-
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..
ఓవల్: ఇంగ్లండ్‌తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ కేవలం 18 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్ మార్క్‌ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లోమాన్(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్(17), ఇంగ్లండ్ సిడ్నీ బార్న్స్(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్(17), పాక్ యాసిర్ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్(18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్(1) ఇంగ్లండ్ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్‌లో రూట్(32), వోక్స్(12) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా -
50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం
50 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఓవల్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం 368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా జట్టుగా రాణించి ఓవల్ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఉమేశ్ బౌలింగ్‌లో ఆండర్సన్(2) ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 210 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చారిత్రక గెలుపుకు ఒకే ఒక్క వికెట్ దూరంలో.. 50 ఏళ్ల నిరీక్షణకు మరో కొద్ది నిమిషాల్లో తెరపడనుంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో గెలుపుకు టీమిండియా ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఓవర్టన్(10) క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ 202 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో రాబిన్సన్(4), ఆండర్సన్ ఉన్నారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమి దాదాపుగా ఖరారైంది. 193 పరుగుల వద్ద ఆ జట్టు కీలకమైన క్రిస్ వోక్స్(18) వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో వోక్స్ ఎనిమిదవ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా చారిత్రక గెలుపుకు మరో రెండు వికెట్ల దూరంలో ఉంది. క్రీజ్‌లో ఓవర్టన్(5) ఉన్నాడు. అంపైర్లు టీ విరామం ప్రకటించారు. రూట్(36) క్లీన్ బౌల్డ్.. గెలుపుకు మరో 3 వికెట్ల దూరంలో టీమిండియా ఇంగ్లండ్ ఆఖరి ఆశాకిరణం రూట్(36) ఎట్టకేలకు పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోర్ 182 పరుగుల వద్ద శార్దూల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ మ్యాచ్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. వోక్స్(12)కు జతగా ఓవర్టన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 186 పరుగులు సాధించాల్సి ఉండగా, చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ డకౌట్ టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కూలుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో సబ్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జో రూట్(18)కు జతగా క్రిస్ వోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 221 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. బుమ్రా ఉగ్రరూపం.. బెయిర్‌స్టో(0) క్లీన్ బౌల్డ్ టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఉగ్రరూపం దాల్చాడు. 5 బంతుల వ్యవధిలో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను పెవిలియన్‌కు పంపి ఆతిధ్య జట్టు నడ్డి విరిచాడు. 146 పరుగుల వద్ద తొలుత ఓలీ పోప్(2)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా అదే స్కోర్ వద్ద బెయిర్‌స్టోను సైతం బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఓటమికి పునాది వేశాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 146 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. జో రూట్(17)కు జతగా మొయిన్ అలీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 222 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) క్లీన్ బౌల్డ్ 5 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. 141 పరుగుల వద్ద హమీద్ వికెట్ కోల్పోయిన ఆతిధ్య జట్టు 146 పరుగుల స్కోర్ వద్ద ఓలీ పోప్(2) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. జో రూట్(17)కు జతగా జానీ బెయిర్‌స్టో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 222 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. హమీద్(63) క్లీన్ బౌల్డ్ లంచ్ తర్వాత మూడో ఓవర్లోనే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న హసీబ్ హమీద్(63; 6 ఫోర్లు)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఆతిధ్య జట్టు మూడో వికెట్ కోల్పోయింది. జో రూట్(14)కు జతగా ఓలీ పోప్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 227 పరుగులు సాధించాల్సి ఉంది. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(5) రనౌట్ జట్టు స్కోర్ 120 పరుగుల వద్ద నుండగా ఇంగ్లండ్‌కు మరో దెబ్బ తగిలింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్(5) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ అద్భుతమై త్రోతో మలాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. హసీబ్ హమీద్(60)కు తోడుగా కెప్టెన్ రూట్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 248 పరుగులు సాధించాల్సి ఉంది. వేట మొదలైంది.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 291 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి సెషన్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్(50; 5 ఫోర్లు) అర్ధశతకం పూర్తయిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. శార్దూల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్ క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ 100 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హమీద్(47) నిలకడగా అడుతుండగా, మలాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 268 పరుగులు సాధించాల్సి ఉంది. ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. కాగా, 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..? -
Ind Vs Eng: విజయానికి 291 పరుగుల దూరం.. పది పడాలి!
ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. లండన్: తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్ మళ్లీ మెరిశాడు 270/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతయ్యాక... జడేజా (17; 3 ఫోర్లు), రహానే (0)లను తన వరుస ఓవర్లలో వోక్స్ అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ కోహ్లి (44; 7 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఒవర్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత స్కోరు 312/6 కాగా... ఆధిక్యం 213 పరుగులు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న యువ ప్లేయర్లు రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ భారత్‌ను సురక్షిత స్థితిలో ఉంచే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ మొదట ఆచితూచిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. లంచ్ విరామానికి భారత్ స్కోరు 329/6గా ఉంది. లంచ్ తర్వాత శార్దుల్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడినంత ధాటిగా కాకపోయినా... ఇక్కడ కూడా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి పంత్ కూడా తోడవ్వడంతో భారత్ ఆధిక్యం 300 పరుగులు చేరుకుంది. ఈ క్రమంలో శార్దుల్ 65 బంతుల్లో మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. çఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా శార్దుల్ ఘనతకెక్కాడు. అనంతరం పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బుమ్రా (24; 4 ఫోర్లు) నిలబడటంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లి (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) (బి) వోక్స్ 17; రహానే (ఎల్బీ) (బి) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దుల్ ఠాకూర్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ యాదవ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (148.2 ఓవర్లలో ఆలౌట్) 466. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237, 4–296, 5–296, 6–312, 7–412, 8–414, 9–450, 10–466. బౌలింగ్: అండర్సన్ 33–10–79–1, రాబిన్సన్ 32–7–105–2, వోక్స్ 32–8–83–3, ఒవర్టన్ 18.2–3–58–1, మొయిన్ అలీ 26–0–118–2, రూట్ 7–1–16–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 77. బౌలింగ్: ఉమేశ్ 6–2–13–0, బుమ్రా 7–3–11–0, జడేజా 13–4–28–0, సిరాజ్ 6–0–24–0. -
కేఎల్ రాహుల్‌కు జరిమానా..
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు. రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట తొలి సెషన్ 34వ ఓవర్లో ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌కు అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8(అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు. దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్‌లో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా -
టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా
ఓవల్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ వార్త తెలిసింది. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి తదుపరి సమాచారం అందేవరకు వీరంతా వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటారని జై షా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ వార్త తెలిసి టీమిండియా సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధిస్తున్న తరుణంలో ఈ వార్త టీమిండియాపై ఏమేరకు ప్రభావం చూపుతోందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ టెస్ట్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’ -
వైరలవుతున్న రోహిత్ ఐదేళ్ల కిందటి ట్వీట్.. ‘చెప్పాడంటే చేస్తాడంతే’
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 94 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. The greatest pleasure in life is doing what people say you cannot do 😊😊 — Rohit Sharma (@ImRo45) September 14, 2016 ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ ఎప్పుడో 2016లో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని ట్రోల్ చేస్తున్న అతని అభిమానులు రోహిత్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ కామెంట్ల రూపంలో హంగామా చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. మనం ఏదైతే చేయలేమని జనం అనుకుంటారో.. దానిని చేసి చూపించడం కంటే ఆనందం మరొకటి ఉండదని రోహిత్ 2016, సెప్టెంబర్ 14న ట్వీట్ చేశాడు. చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..! ఆ ట్వీట్‌ను ఇప్పుడు రోహిత్ అభిమానులు వైరల్‌గా మార్చేశారు. ఎందుకంటే.. టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతున్నా, విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడన్న అపవాదు రోహిత్‌పై ఉంది. మొత్తానికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ ఆ అపవాదును చెరిపేసుకున్నాడు. కీలకమైన సమయంలో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటడంతోపాటు జట్టును కూడా ఆదుకుని, తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. చదవండి: డుప్లెసిస్ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు.. -
అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్ ఒక్కడే అత్యధికంగా ఇలా..!
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన సెంచరీతో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లి 73 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. రోహిత్ 74 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కాగా, సెహ్వాగ్ 2004లో పాక్‌తో జరిగిన ముల్తాన్ టెస్ట్‌లో ట్రిపుల్ హండ్రెండ్(309) సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వీరూ డబుల్ హండ్రెడ్ను, ట్రిపుల్ సెంచరీని సిక్సర్‌తోనే కంప్లీట్ చేశాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ అత్యధికంగా 6 సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకోగా, రోహిత్ 3 పర్యాయాలు, గౌతమ్ గంభీర్(2), రిషబ్ పంత్(2) ఇదే తరహాలో సెంచరీని కంప్లీట్ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా స్పిన్నర్లు హర్భజన్, అశ్విన్‌లు అలాగే ద వాల్ రాహుల్ ద్రవిడ్, నయా వాల్ పుజారాలు కూడా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్ రాహుల్ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెప్టెన్ కోహ్లి (22 బ్యాటింగ్; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. చదవండి: ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్.. -
ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్..
లండన్: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69ను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్ చేశారు. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 'జార్వో 69' పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్, లీడ్స్ టెస్ట్, ఓవల్ టెస్ట్) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్ టెస్ట్ రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. Jarvo is at the crease #engvsindia pic.twitter.com/XlATed4vGg — JJK (@72jjk) August 27, 2021 ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ పోప్ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు. India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డు.. అత్యంత తక్కువ టెస్టుల్లో
లండన్: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనతను అందుకున్నాడు. అత్యంత తక్కువ టెస్టుల్లో 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్‌ఖాన్‌తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కపిల్‌దేవ్ 39 టెస్టుల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత జగవల్ శ్రీనాథ్(40 టెస్టులు), మహ్మద్ షమీ( 42 టెస్టులు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక జహీర్‌ఖాన్ కూడా 49 టెస్టుల్లో 150 వికెట్లు తీశాడు. మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగో టెస్టులో మలాన్, జో రూట్, క్రెయిగ్ ఓవర్టన్‌లను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్ 38, బెయిర్ స్టో 34 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ENG Vs IND Intruder Jarvo 69: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
రెండో రోజూ అదే ఫ్లాప్ షో!
-
ఓవల్ ను ఛేదిస్తారా!
లండన్: క్రికెట్ పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో ధోని సేన కొత్త చరిత్రను సృష్టించాక సగటు భారతాభిమాని సిరీస్ పై ఆశలు పెంచుకున్నాడు. అయితే మనం ఒకటి తలస్తే.. మన ధోని గ్యాంగ్ మరోటి తలచింది. లార్డ్స్ టెస్టు అనంతరం మంచి ఊపు మీద కనిపించిన ధోనీ గ్యాంగ్ దారుణంగా విఫలమై సిరీస్ పై ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇప్పటికే మూడు, నాల్గో టెస్టుల్లో గెలిచి ఈ సిరీస్ ను తమ చేతుల్లోకి తీసుకున్న ఇంగ్లండ్ ఫైనల్ టెస్టును కైవసం చేసుకుని సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా, ధోనీ సేన మాత్రం టెస్టును గెలిచి సిరీస్ ను సమం చేయాలని వ్యూహరచన చేస్తోంది. భారత్ కు సిరీస్ ను నిలబెట్టుకోవాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ఓవల్ లో ఆరంభం కానున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి చవిచూసిన భారత్ ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. ఈ తరుణంలో భారత్ చివరి టెస్టును ఏ రకంగా నెట్టుకొస్తోందో చూడాలి. ఈ టెస్టు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేస్తారా? లేక ఆ మ్యాచ్ ను కూడా ఇంగ్లండ్ చేతిలో పెట్టి భారత్ కు ఉట్టి చేతుల్తో తిరిగి వస్తారా?అనేది చూడాల్సి ఉంది. -
స్టీవెన్ స్మిత్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా!
యాషెస్ సిరీస్ లో భాగంగా ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ, చివరి టెస్ట్ రెండవ రోజు ఆట లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండవ రోజు ఆటలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు స్మిత్ రాణించి సెంచరీ సాధించాడు. స్మిత్ 105 పరుగులతోనూ ఆటను కొనసాగిస్తున్నాడు. తొలి రోజు ఆటలో షేన్ వాట్సన్ 176 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. కడపటి వార్తలు అందేసరికి ఆస్టేలియా జట్టు ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అండర్సన్ మూడు వికెట్లు, బ్రాడ్, స్వాన్, ట్రాట్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది. -
ఓవల్ టెస్ట్ లో షేన్ వాట్సన్ సెంచరీ
యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తన మూడో సెంచరీ సాధించడంతో పటిష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు స్కోరు 11 పరుగులు ఉండగా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో ఓపెనర్ వార్నర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోజర్స్ 23, క్లార్క్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే ఆతర్వాత క్రీజులో వచ్చిన షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించాడు. వాట్సన్ 108, స్మిత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అండర్సన్ రెండు, స్వాన్ కు ఒక వికెట్ లభించింది. ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది.