స్టీవెన్ స్మిత్ సెంచరీ, భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా!
రెండవ రోజు ఆటలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు స్మిత్ రాణించి సెంచరీ సాధించాడు. స్మిత్ 105 పరుగులతోనూ ఆటను కొనసాగిస్తున్నాడు.
యాషెస్ సిరీస్ లో భాగంగా ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ, చివరి టెస్ట్ రెండవ రోజు ఆట లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండవ రోజు ఆటలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు స్మిత్ రాణించి సెంచరీ సాధించాడు. స్మిత్ 105 పరుగులతోనూ ఆటను కొనసాగిస్తున్నాడు.
తొలి రోజు ఆటలో షేన్ వాట్సన్ 176 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. కడపటి వార్తలు అందేసరికి ఆస్టేలియా జట్టు ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అండర్సన్ మూడు వికెట్లు, బ్రాడ్, స్వాన్, ట్రాట్ చెరో వికెట్ పడగొట్టారు.
ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది.