ఓవల్ టెస్ట్ లో షేన్ వాట్సన్ సెంచరీ
యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ తన మూడో సెంచరీ సాధించడంతో పటిష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు స్కోరు 11 పరుగులు ఉండగా 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో ఓపెనర్ వార్నర్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోజర్స్ 23, క్లార్క్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే ఆతర్వాత క్రీజులో వచ్చిన షేన్ వాట్సన్ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించాడు. వాట్సన్ 108, స్మిత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అండర్సన్ రెండు, స్వాన్ కు ఒక వికెట్ లభించింది.
ఐదు టెస్టులో సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో వెనుకంజలో ఉంది. 1977 తర్వాత ఒక్క టెస్ట్ లో కూడా విజయం సాధించకుండా సిరీస్ కోల్పోలేదు. చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా చూస్తొంది.