
లండన్: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ టెస్టుల్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 31 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనతను అందుకున్నాడు. అత్యంత తక్కువ టెస్టుల్లో 150 వికెట్ల ఫీట్‌ను అందుకున్న టీమిండియా బౌలర్లలో జహీర్‌ఖాన్‌తో కలిసి ఉమేశ్ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కపిల్‌దేవ్ 39 టెస్టుల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత జగవల్ శ్రీనాథ్(40 టెస్టులు), మహ్మద్ షమీ( 42 టెస్టులు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక జహీర్‌ఖాన్ కూడా 49 టెస్టుల్లో 150 వికెట్లు తీశాడు.
మొదటి మూడు టెస్టుల్లో ఉమేశ్‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో టెస్టులో షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగో టెస్టులో మలాన్, జో రూట్, క్రెయిగ్ ఓవర్టన్‌లను ఉమేశ్ పెవిలియన్ చేర్చాడు. ఇక ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓలీ పోప్ 38, బెయిర్ స్టో 34 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ టీమిండియా కంటే ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ENG Vs IND Intruder Jarvo 69: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో