లండన్: టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ దేశస్తుడు జార్వో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో మైదానంలోకి దూసుకొచ్చిన జార్వో ఆటకు అంతరాయం కలింగించాడు. తాజాగా జార్వో మరోసారి మైదానంలోకి వచ్చేశాడు. ఈసారి బౌలర్ అవతారంలో వచ్చిన జార్వో బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఉమేశ్ యాదవ్ 34వ ఓవర్‌లో రెండు బంతులు వేసి మూడో బంతికి సిద్ధమయ్యాడు. ఇంతలో జార్వో వేగంగా మైదానంలోకి దూసుకొచ్చి రన్ తీసుకుంటూ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బెయిర్ స్టోను తగులుతూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. అయితే జానీ బెయిర్ స్టో జార్వోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది.
చదవండి: ENG Vs IND Intruder Jarvo: 'ఇంగ్లండ్ భయపడింది'.. అందుకే నిషేధం
జార్వో చర్యతో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, అంపైర్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు అతనిపై జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసారి ఏకంగా ఈసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాగా జార్వోపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు
Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021
Comments
Please login to add a commentAdd a comment