భారత మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్ సహనం కోల్పోయి బ్యాట్‌తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది.
అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్ దూరం కానుంది.
ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లకు వైస్‌కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్‌కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
కాగా హర్మన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెపె్టన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది.
చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..
వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. భద్రతా కారణాల దృష్ట్యా..!
Comments
Please login to add a commentAdd a comment