ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆదివారం అఫ్గానిస్తాన్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’ నుంచి సూపర్–4కు ముందంజ వేయాలంటే బంగ్లాదేశ్ ఇందులో తప్పక గెలవాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో శ్రీలంక చేతిలో బోల్తా పడిన షకీబుల్ బృందం అఫ్గాన్‌తో జరిగే పోరులో పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓటమిపాలైతే టోర్నీ నుంచే నిష్కమ్రించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు యేటికేడు రాటుదేలుతున్న అఫ్గానిస్తాన్ తమదైన రోజున ఎంతటి ప్రత్యర్ధినైనా కంగుతినిపించగలదు. ఇదే నమ్మకంతో ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో శుభారంభం ఇవ్వాలనే లక్ష్యంతో అఫ్గాన్ బరిలోకి దిగనుంది.
కాగా ఈ టోర్నీకి ముందు పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. సిరీస్ ఓటమితో ఆసియాకప్ టోర్నీలోకి ఆఫ్గాన్ అడుగుపెట్టింది.
తుది జట్లు(అంచనా)
బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, గుల్బాదిన్ నాయబ్/కరీం జనత్, మహ్మద్ సలీమ్ సఫీ
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment