T20 WC Warm Up Matches: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన మూడో వార్మప్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆతిధ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించగా.. రెండో మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించింది. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో అప్ఘాన్ జట్టు అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగి తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌ను 62 పరుగుల భారీ తేడాతో ఓడించి శభాష్ అనిపించుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీమ్ జద్రాన్ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ నబీ (17 బంతుల్లో 41 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ అహ్మద్, షకీబ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఫజల్ హాక్ ఫారూఖీ (3/9), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/5), మహ్మద్ నబీ (1/11) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులకు మాత్రమే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఆద్యంతం బంగ్లా బ్యాటింగ్ చెత్తగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment