టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి మహ్మద్ నబీ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని నబీ శుక్రవారం స్వయంగా తన ట్విటర్‌లో పేర్కొన్నాడు. ''మా టి20 వరల్డ్‌కప్ ప్రయాణం నేటితో ముగిసింది. ప్రపంచకప్‌లో మాకు వచ్చిన ఫలితాలు మాకు కానీ, మా మద్దతు దారులకు కానీ నచ్చలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా.
ఒక సంవత్సరం నుంచి మా జట్టు సన్నద్ధత కెప్టెన్ కోరుకునే స్థాయికి లేదా పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైన స్థాయిలో లేదు. పైగా, గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ, నేను ఒకే పేజీలో లేము. ఇది జట్టు బ్యాలెన్స్‌పై ప్రభావాన్ని చూపింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయమని భావించా.
ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలిపాను.కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి ఒక ఆటగాడిగా మాత్రం కంటిన్యూ అవుతాను. ఇన్నాళ్లు కెప్టెన్‌గా మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు దెబ్బతిన్నప్పటికి మాపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నిజంగా మాకు చాలా ముఖ్యమైనది. లవ్ యూ అఫ్గానిస్తాన్ ''అంటూ ముగించాడు.
ఇక మహ్మద్ నబీ కెప్టెన్‌గా ఎంపికయ్యాకా అఫ్గానిస్తాన్ గోల్డెన్ డేస్ చూసింది. అతని హహాంలోనే ఆఫ్గన్ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి వచ్చింది. 2017లో ఆఫ్గన్ టెస్టు హోదా కూడా పొందింది. మొత్తంగా మహ్మద్ నబీ అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా 28 వన్డేలు, 35 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.
— Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022
Comments
Please login to add a commentAdd a comment