ICC Cricket World Cup 2023- Bangladesh vs Afghanistan, 3rd Match Updates: 156 పరుగులకు ఆఫ్గనిస్తాన్ ఆలౌట్.. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్
భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. ధర్మశాల మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి తొలి విజయం నమోదు చేసింది.
22 ఓవర్లలో బంగ్లా స్కోరు: 99/2
మిరాజ్, షాంటో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ డౌన్
6.4: ఫరూకీ బౌలింగ్‌లో లిటన్ దాస్ బౌల్డ్(13)
4.1: ఫరూకీ బౌలింగ్‌లో తాంజిద్ హసన్(5) రనౌట్. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.
37.2: ఆఫ్గనిస్తాన్ ఆలౌట్
నవీన్ ఉల్ హక్ రూపంలో ఆఫ్గాన్ పదో వికెట్ కోల్పోయింది. దీంతో బంగ్లాతో మ్యాచ్‌లో 37.2 ఓవర్లలో 156 పరుగులకే ఆఫ్గనిస్తాన్ ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బంగ్లాదేశ్ ఛేదనకు దిగనుంది.
36.3: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆఫ్గాన్
ఆఫ్గనిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 156 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మిరాజ్ బౌలింగ్‌లో ముజీబ్ అవుట్ కావడంతో ఫారూకీ క్రీజులోకి వచ్చాడు
బంగ్లా బౌలర్ల దెబ్బకు ఆఫ్గాన్ బ్యాటర్లు విలవిల
35.2: షోరిఫుల్లా ఇస్లాం బౌలింగ్‌లో ఒమర్జాయ్(22) బౌల్డ్. ఎనిమిదో వికెట్ డౌన్. స్కోరు: 156/8 (35.2)
34.2: ఏడో వికెట్ కోల్పోయిన ఆఫ్గాన్
మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్(9) బౌల్డ్. స్కోరు: 150/7 (34.2). ఒమర్జాయ్ 17, ముజీబ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు
29.6: కష్టాల్లో ఆఫ్గాన్.. 30 ఓవర్లలో స్కోరు ఎంతంటే
టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో మహ్మద్ నబీ(6) బౌల్డ్. స్కోరు: 126/6 (30)
28.4: ఐదో వికెట్ డౌన్
షకీబ్ అల్ హసన్ బౌలింగ్ నజీబుల్లా(5) అవుట్. ఐదో వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్తాన్. స్కోరు: 123-5(29)
25.2: నాలుగో వికెట్ కోల్పోయిన ఆఫ్గన్
నిలకడగా ఆడుతున్న గుర్బాజ్(47)ను ముస్తాఫిజుర్ పెవిలియన్‌కు పంపాడు. స్కోరు: 112-4(26)
24.4: మూడో వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్తాన్
మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో షాహిది(18) అవుట్. స్కోరు: 112/3 (24.5)
23 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 106/2
23 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(47), హస్మతుల్లా షాహిదీ(13) ఉన్నారు.
సెకెండ్ వికెట్ డౌన్..
83 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రెహమత్‌షా.. షకీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 86/2
తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రెహమత్ షా వచ్చాడు.
5 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 27/1
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ నిలకడగా ఆడుతోంది. 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా ఆఫ్గాన్ 27 పరుగులు చేసింది. క్రీజులో రహ్మతుల్లా గుర్భాజ్(9), ఇబ్రహీం జద్రాన్(16) పరుగులతో ఉన్నారు.
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఇరు జట్లుకు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా రెండు వామప్ మ్యాచ్‌లకు దూరమైన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖీ
బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment