
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిని అఫ్గాన్ కెప్టెన్ గుల్బదిన్ నైబ్ ముందుగా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ బంగ్లాదేశ్ ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఆ జట్టు ఐదు పాయింట్లతో ఉంది. ఇక అఫ్గానిస్తాన్ ఇప్పటికే ఇంటి ముఖం పట్టింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.( ఇక్కడ చదవండి: మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం)
ఇదిలా ఉంచితే, ఇరు జట్లు 7 సార్లు వన్డేల్లో తలపడగా, 4 సార్లు బంగ్లాదేశ్ గెలిచింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్ విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఒకసారి మాత్రమే ముఖాముఖి పోరులో తలపడ్డాయి. అందులో బంగ్లాదేశ్ గెలుపొందింది. 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ 105 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్గాన్ భావిస్తోంది. బంగ్లాదేశ్‌కు షాకిచ్చి టోర్నీలో బోణీ కొట్టడానికి అఫ్గాన్ సిద్ధమైంది. మరొకవైపు అఫ్గాన్‌పై గెలిచి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment