Asia Cup 2022- Bangladesh vs Afghanistan Winner Prediction: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మంగళవారం(ఆగష్టు 30) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్- బిలో ఉన్న షకీబ్ అల్ హసన్ బృందం.. అదే గ్రూప్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌తో షార్జా వేదికగా తలపడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీ పడిన అఫ్గన్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
మరోవైపు బంగ్లాదేశ్ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలో పరాభవాల తర్వాత ఈ టీ20 టోర్నీలో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మంగళవారం నాటి మ్యాచ్‌లో విజేత ఎవరో తేల్చేశాడు.
ఈ జట్టు అస్సలు గెలవదు!
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ బలాబలాలు, విజయావకాశాలపై అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘బంగ్లాదేశ్ అస్సలు గెలిచే ఛాన్సే లేదు. సికందర్ రజా(జింబాబ్వే బ్యాటర్) వాళ్ల బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డేల్లో పర్లేదు గానీ.. టీ20లలో వాళ్ల పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగాలేదు.
ఒకవేళ షార్జా పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. ఎక్కువ పరుగులు రాబట్టే అవకాశం లేకపోతే.. బంగ్లాదేశ్ విజయావకాశాలు కాస్త మెరుగుపడతాయి. అయితే, బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే గట్టి పోటీనివ్వగలరు.
ఇక మహ్మదుల్లా, సబ్బీర్ రెహమాన్, ముష్ఫికర్, షకీబ్ అల్ హసన్, మెహెదీ హసన్, మెహెదీ హసన్ మిరాజ్‌లు ఉన్నారు. కాబట్టి మరీ ఈ జట్టును చెత్త అని తీసిపారేలేము గానీ.. స్థాయికి తగ్గట్లు మాత్రం కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
సిక్సర్ల వర్షం కురిపిస్తారు!
ఇక అఫ్గనిస్తాన్ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టు బాగుంది. వాళ్లు ఎక్కువగా సిక్సర్లు బాదటానికి ప్రయత్నిస్తారు. రహ్మనుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్.. ఈ పిచ్‌పై రాణించగలరు. మరీ ఎక్కువ బౌన్సీ వికెట్ కాదు కాబట్టి వాళ్లు విజృంభించగలరు’’ అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. బౌలర్లు సైతం మెరుగ్గా రాణించగలరని, శ్రీలంకను కట్టడి చేసిన తీరును గుర్తుచేశాడు.
కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గన్ బౌలర్లు చెలరేగిన విషయం తెలిసిందే. లంకను 105 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫజల్‌హక్ ఫారూఖీ 3.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి లంక జట్టు పతనాన్ని శాసించాడు. ఇక బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో చెలరేగి ఏకంగా 40 పరుగులు సాధించాడు.
తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శ్రీలంకపై విజయంతో అఫ్గనిస్తాన్ ప్రస్తుతం గ్రూప్-బి టాపర్‌గా ఉంది. బంగ్లాతో మ్యాచ్ గెలిస్తే సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది. ఇక బంగ్లా- అఫ్గన్‌ల మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం కానుంది.
చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు?
Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..
Comments
Please login to add a commentAdd a comment