sharjah cricket stadium
-
Viral Video: ఆఫ్ఘన్ ఫ్యాన్స్ క్రూర ప్రవర్తన.. పాక్ అభిమానులపై దాడులు
ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 7) పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ వికెట్ తేడాతో పరాజయం పాలై, టీమిండియాతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ పదో నంబర్ ఆటగాడు నసీమ్ షా ఆఖరి ఓవర్లో మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్‌ను గెలిపించాడు. అప్పటివరకు ఆఫ్ఘన్ చేతుల్లోనే ఉన్న మ్యాచ్ (6 బంతుల్లో 11 పరుగులు).. నసీమ్ వీర విజృంభణ ధాటికి పాక్ వశమైంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చేసింది 129 పరుగులే అయినప్పటికీ.. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో ఆఫ్ఘాన్ ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa — Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022 అయితే, జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆఫ్ఘన్ అభిమానులు మాత్రం ఓవరాక్షన్ చేశారు. మ్యాచ్ అనంతరం షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. కుర్చీలు విరుగగొట్టి, పాక్ అభిమానులపై దాడులు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అప్పటివరకు పాక్ అభిమానులతో కలిసి మ్యాచ్ చూసిన ఆఫ్ఘన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా పేట్రేగిపోయి తాలిబన్లలా అమానవీయంగా వ్యవహరించారు. కొద్ది నిమిషాల పాటు స్టేడియంలో వీరంగం సృష్టించారు. ఆఫ్ఘన్ ఫ్యాన్స్ దెబ్బకు పాక్ అభిమానులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియం నుంచి దౌడు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏ క్రీడలోనైనా గెలుపోటములు సహజమని, వాటిని క్రీడా స్పూర్తితో స్వీకరించాలే కానీ ఇలా దాడులకు దిగడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో ఇలాంటి చర్యలను సహించకూడదని, ఆఫ్ఘన్ అభిమానులను స్టేడియాల్లోకి రానీయకుండా నిషేధించాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఈ వీడియోపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించడాన్ని మాత్రం భారత అభిమానులు తప్పుపడుతున్నారు. అక్తర్ ఆఫ్ఘన్ అభిమానుల దుశ్చర్యను ఖండిస్తూ, హిత బోధ చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అక్తర్ చిలకపలుకులు పలికింది చాలు.. ముందు మీ ఆటగాళ్లను ప్రవర్తన సరిచేసుకోమని చెప్పు అంటూ ఆసిఫ్ అలీ-ఆఫ్ఘన్ బౌలర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్‌ను ఆసిఫ్ అలీ బ్యాట్‌తో కొట్టబోయాడు. చదవండి: మహ్మద్ నబీ చెత్త రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బ్యాటర్‌గా -
Asia Cup: ఇంకో 10 పరుగులు చేసినా బాగుండు.. ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి
Asia Cup 2022 Bangladesh vs Afghanistan: ఆసియా కప్-2022 టోర్నీలో అఫ్గనిస్తాన్ అదరగొడుతోంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన నబీ బృందం... మంగళవారం(ఆగష్టు 30) బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. షార్జా వేదికగా సాగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తద్వారా గ్రూప్- బి టాపర్‌గా నిలిచి సూపర్ 4కు అర్హత సాధించింది. మరోవైపు.. బంగ్లాదేశ్.. శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిస్తే తప్ప రేసులో నిలవలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం బంగ్లా ఆల్‌రౌండర్ ముసాదిక్ హొసేన్ మాట్లాడుతూ.. తమ జట్టు కనీసం 140 పరుగులు నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఘోర ఓటమి కారణంగా తదుపరి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోక తప్పని స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు. ఈ మేరకు హొసేన్ మాట్లాడుతూ.. ‘‘టీ20 మ్యాచ్‌లలో ఆరంభంలోనే అంటే పవర్ ప్లేలో రెండు, మూడు వికెట్లు కోల్పోయామంటే పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒకవేళ మేము 140 పరుగులైనా చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారింది. తదుపరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మా బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే బాగుండేది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా సెప్టెంబరు 1న శ్రీలంకతో బంగ్లాదేశ్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇక బంగ్లాదేశ ఇటీవలి కాలంలో వెస్టిండీస్, జింబాబ్వేతో వరుసగా టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఐర్లాండ్‌కు టీ20 సిరీస్ కోల్పోయి.. ఆ వెంటనే యూఏఈకి చేరుకున్న అఫ్గనిస్తాన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో వరుస విజయాలు నమోదు చేయడం విశేషం. మ్యాచ్ ఇలా సాగింది( Afghanistan Beat Sri Lanka By 7 Wickets) అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గన్ బౌలర్లు ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇద్దరూ కలిసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో షకీబ్ అల్ హసన్ బృందం.. ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆల్‌రౌండర్ ముసాదిక్ హొసేన్(31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను తమవైపు తిప్పేశాడు. ఇక ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి అఫ్గన్‌ను గెలిపించాడు. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించిన ముజీబ్ వుర్ రహ్మాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Asia Cup 2022 IND Vs HK: హాంకాంగ్‌తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ د بریا شېبې 😍 ----- لحظات پیروزی 🥰 ----- Winning Moments 🤩#AfghanAtalan | #AsiaCup2022 pic.twitter.com/RsBlL0Cpbb — Afghanistan Cricket Board (@ACBofficials) August 30, 2022 -
Asia Cup 2022: ఆ జట్టు అస్సలు గెలవదు: టీమిండియా మాజీ క్రికెటర్
Asia Cup 2022- Bangladesh vs Afghanistan Winner Prediction: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మంగళవారం(ఆగష్టు 30) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్- బిలో ఉన్న షకీబ్ అల్ హసన్ బృందం.. అదే గ్రూప్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌తో షార్జా వేదికగా తలపడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీ పడిన అఫ్గన్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలో పరాభవాల తర్వాత ఈ టీ20 టోర్నీలో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మంగళవారం నాటి మ్యాచ్‌లో విజేత ఎవరో తేల్చేశాడు. ఈ జట్టు అస్సలు గెలవదు! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ బలాబలాలు, విజయావకాశాలపై అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘బంగ్లాదేశ్ అస్సలు గెలిచే ఛాన్సే లేదు. సికందర్ రజా(జింబాబ్వే బ్యాటర్) వాళ్ల బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డేల్లో పర్లేదు గానీ.. టీ20లలో వాళ్ల పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగాలేదు. ఒకవేళ షార్జా పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. ఎక్కువ పరుగులు రాబట్టే అవకాశం లేకపోతే.. బంగ్లాదేశ్ విజయావకాశాలు కాస్త మెరుగుపడతాయి. అయితే, బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే గట్టి పోటీనివ్వగలరు. ఇక మహ్మదుల్లా, సబ్బీర్ రెహమాన్, ముష్ఫికర్, షకీబ్ అల్ హసన్, మెహెదీ హసన్, మెహెదీ హసన్ మిరాజ్‌లు ఉన్నారు. కాబట్టి మరీ ఈ జట్టును చెత్త అని తీసిపారేలేము గానీ.. స్థాయికి తగ్గట్లు మాత్రం కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తారు! ఇక అఫ్గనిస్తాన్ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టు బాగుంది. వాళ్లు ఎక్కువగా సిక్సర్లు బాదటానికి ప్రయత్నిస్తారు. రహ్మనుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్.. ఈ పిచ్‌పై రాణించగలరు. మరీ ఎక్కువ బౌన్సీ వికెట్ కాదు కాబట్టి వాళ్లు విజృంభించగలరు’’ అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. బౌలర్లు సైతం మెరుగ్గా రాణించగలరని, శ్రీలంకను కట్టడి చేసిన తీరును గుర్తుచేశాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గన్ బౌలర్లు చెలరేగిన విషయం తెలిసిందే. లంకను 105 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫజల్హక్ ఫారూఖీ 3.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి లంక జట్టు పతనాన్ని శాసించాడు. ఇక బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో చెలరేగి ఏకంగా 40 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శ్రీలంకపై విజయంతో అఫ్గనిస్తాన్ ప్రస్తుతం గ్రూప్-బి టాపర్‌గా ఉంది. బంగ్లాతో మ్యాచ్ గెలిస్తే సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది. ఇక బంగ్లా- అఫ్గన్ల మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం కానుంది. చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు? Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి.. -
‘రాయల్’గా ఆరంభం
తొలి మ్యాచ్‌లో చెలరేగిన బెంగళూరు యువరాజ్, కోహ్లిల మెరుపు ఇన్నింగ్స్ డేర్ డెవిల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు బెంగళూరు జట్టులో హాట్ టాపిక్ యువరాజ్ సింగ్. టి20 ప్రపంచకప్ ఫైనల్ అనుభవం దృష్ట్యా... ఐపీఎల్లో ఏం చేస్తాడో అనే బెంగ బెంగళూరు జట్టులో ఉంది. కానీ తొలి మ్యాచ్‌తోనే పూర్తిగా గాడిలో పడ్డానని యువీ నిరూపించాడు. సిక్సర్లతో చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపులకు కోహ్లి నిలకడ తోడవడంతో... ఐపీఎల్-7ను రాయల్ చాలెంజర్స్ ఘనంగా ఆరంభించింది. షార్జా: జట్టులో భారీ మార్పులతో ఏడో సీజన్‌ను ప్రారంభించినా ఢిల్లీడేర్‌డెవిల్స్ ఆటతీరులో మాత్రం మార్పు కనపడలేదు. గత ఏడాది తరహాలోనే ఆల్‌రౌండ్ వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. షార్జా స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. డుమిని (48 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టేలర్ (39 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 110 పరుగులు జోడించడం విశేషం. బెంగళూరు జట్టు 16.4 ఓవర్లలో రెండు వికెట్లకు 146 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. పార్థివ్ పటేల్ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చాడు. కెప్టెన్ కోహ్లి (38 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడారు. మూడో వికెట్‌కు ఈ ఇద్దరూ అజేయంగా 84 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బెంగళూరు స్పిన్నర్ చహల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదుకున్న డుమిని, టేలర్ బెంగళూరు బౌలర్లు స్టార్క్, ఆల్బీ మోర్కెల్, వరుణ్ ఆరోన్‌లు వరుస ఓవర్లలో మయాంక్ అగర్వాల్, దినేశ్ కార్తీక్, మనోజ్ తివారీలను పెవిలియన్ పంపారు. దీంతో ఢిల్లీ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాసేపు ధాటిగా ఆడిన విజయ్ (18)ని చహల్ వెనక్కి పంపాడు. ఈ సమయంలో డుమిని, టేలర్.. ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నిదానంగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 49 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇద్దరూ సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చారు. 15 ఓవర్ల వరకు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు స్లాగ్ ఓవర్లలో లయ తప్పారు. దీన్ని తమకు అనుకూలంగా మల్చుకున్న బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడారు. 16వ ఓవర్లో సిక్సర్ కొట్టి టచ్‌లోకి వచ్చిన డుమిని, 18వ ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో డుమినికి తోడుగా టేలర్ కూడా చెలరేగడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ 63 పరుగులు రాబట్టింది. యువీ, కోహ్లి అదుర్స్ బెంగళూరు డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ వెన్నునొప్పి కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో అతని స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న మ్యాడిన్సన్ రెండో ఓవర్లోనే షమీ బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగాడు. 6 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకున్నప్పటికీ బెంగళూరు బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడారు. నదీమ్ వేసిన ఆరో ఓవర్లో పార్థివ్ పటేల్ ఓ సిక్సర్, ఫోర్ కొట్టి అదే ఊపును కొనసాగించాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత పటేల్ అవుటయ్యాడు. యువరాజ్ సింగ్ ఆరంభం నుంచే వేగంగా ఆడాడు. మరోవైపు 23, 24 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లి రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లను నీషమ్, అగర్వాల్ నేలపాలు చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లి సిక్సర్లతో చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో యువరాజ్ సింగ్ ఆకాశ మే హద్దుగా చెలరేగి మొత్తం ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో మరో 20 బంతులు మిగిలుండగానే బెంగళూరు గెలిచింది. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) కోహ్లి (బి) స్టార్క్ 6; మురళీ విజయ్ (బి) చహల్ 18 ; దినేశ్ కార్తీక్ (సి) పార్థివ్ పటేల్ (బి) ఆల్బీ మోర్కెల్ 0; మనోజ్ తివారీ (సి) పార్థివ్ పటేల్ (బి) వరుణ్ ఆరోన్ 1; డుమిని నాటౌట్ 67; రాస్ టేలర్ నాటౌట్ 43; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-15; 2-16; 3-17; 4-35. బౌలింగ్: స్టార్క్ 4-0-33-1; ఆల్బీ మోర్కెల్ 3-0-18-1; ఆరోన్ 3-1-9-1; చహల్ 4-0-18-1; దిండా 4-0-51-0; యువరాజ్ 2-0-16-0 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ పటేల్ (బి) శర్మ 37; మ్యాడిన్సన్ (సి) కార్తీక్ (బి) షమీ 4; కోహ్లి 49 నాటౌట్; యువరాజ్ 52 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-6; 2-62. బౌలింగ్: డుమిని 2-0-10-0; షమీ 4-0-30-1; పార్నెల్ 3-0-19-0; నదీమ్ 2.4-0-32-0; రాహుల్ శర్మ 3-0-33-1; నీషమ్ 2-0-22-0. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సా. గం. 4.00 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ X రాజస్థాన్ రాయల్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: అబుదాబి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మూడో వన్డేలో పాక్ విజయం
113 పరుగులతో లంక చిత్తు షార్జా: మొహమ్మద్ హఫీజ్ (136 బంతుల్లో 140 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. హఫీజ్, షెహజాద్ (89 బంతుల్లో 81; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 160 పరుగులు జోడించి భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం లంక 44.4 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. దిల్షాన్ (62 బంతుల్లో 59; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, కెప్టెన్ మాథ్యూస్ (51 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్స్‌లు) చివర్లో కొద్ది సేపు పోరాడాడు. పాక్ బౌలర్లలో గుల్ 3 వికెట్లు తీయగా, అజ్మల్, హఫీజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాక్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే 25న జరుగుతుంది. -
తొలి వన్డే దక్షిణాఫ్రికాదే
షార్జా: లక్ష్యం 184 పరుగులు... ఓ దశలో పాక్ స్కోరు 165/4... గెలవడానికి మరో 19 పరుగులు అవసరం... చేతిలో దాదాపు 9 ఓవర్లు ఉన్నాయి. ఇంకేముంది అందరూ మిస్బాసేన విజయం ఖాయమనుకున్నారు. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 17 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. దీంతో బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో పాక్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 49.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. పార్నెల్ (56), మిల్లర్ (37) రాణించగా, స్మిత్ (20), డుమిని (20) ఓ మోస్తరుగా ఆడారు. అజ్మల్ 4, ఆఫ్రిది 3, తన్వీర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 46.3 ఓవర్లలో 182 పరుగులు చేసి ఓడింది. అహ్మద్ షెహజాద్ (58) టాప్ స్కోరర్. మిస్బా (31), హఫీజ్ (28) ఫర్వాలేదనిపించారు. షెహజాద్, మిస్బా రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో ఏ ఒక్కరు క్రీజులో నిలబడలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పార్నెల్, తాహిర్ చెరో మూడు, మోర్నీ మోర్కెల్, సొట్‌సోబ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే నేడు (శుక్రవారం) జరుగుతుంది.