మూడో వన్డేలో పాక్ విజయం | Pakistan beats Sri Lanka as Hafeez stars | Sakshi
Sakshi News home page

మూడో వన్డేలో పాక్ విజయం

Published Tue, Dec 24 2013 1:01 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

మూడో వన్డేలో పాక్ విజయం - Sakshi

మూడో వన్డేలో పాక్ విజయం


 113 పరుగులతో లంక చిత్తు
 షార్జా: మొహమ్మద్ హఫీజ్ (136 బంతుల్లో 140 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. హఫీజ్, షెహజాద్ (89 బంతుల్లో 81; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 160 పరుగులు జోడించి భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం లంక 44.4 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌటైంది. దిల్షాన్ (62 బంతుల్లో 59; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, కెప్టెన్ మాథ్యూస్ (51 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్స్‌లు) చివర్లో కొద్ది సేపు పోరాడాడు. పాక్ బౌలర్లలో గుల్ 3 వికెట్లు తీయగా, అజ్మల్, హఫీజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో పాక్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే 25న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement