వారెవ్వా హఫీజ్! | Mohammad Hafeez leads Pakistan to series victory over Sri Lanka | Sakshi
Sakshi News home page

వారెవ్వా హఫీజ్!

Published Fri, Dec 27 2013 1:53 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

మహమ్మద్ హఫీజ్ - Sakshi

మహమ్మద్ హఫీజ్

అబుదాబీ: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ హఫీజ్ (119 బంతుల్లో 113 నాటౌట్, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సిరీస్‌లో ముచ్చటగా మూడో సెంచరీ సాధించాడు. దీంతో శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో పాక్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో వన్డే మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
 
 నాలుగు వన్డేల్లో హఫీజ్ మూడు సెంచరీలు చేయగా... ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ పాక్ గెలిచింది. సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ఆరో బ్యాట్స్‌మన్‌గా హఫీజ్ రికార్డుల్లోకెక్కాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత  శ్రీలంక 48.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ప్రియాంజన్ (74), సంగక్కర (51) అర్ధసెంచరీలు చేశారు. అజ్మల్ 4, ఉమర్ గుల్ 3 వికెట్లు తీశారు. పాకిస్థాన్ 41.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement