పోరాడి ఓడిన లంక | Pakistan won first one day international | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన లంక

Published Fri, Dec 20 2013 1:38 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

మహ్మద్ హఫీజ్ - Sakshi

మహ్మద్ హఫీజ్

షార్జా: పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక పోరాడి ఓడింది. లోయర్ ఆర్డర్‌లో సేనానాయకే (24 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్సర్), ప్రసన్న (25 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేసినా వరుస విరామాల్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
 
 దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ హఫీజ్ (129 బంతుల్లో 122; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 49.4 ఓవర్లలో 311 పరుగులకు పరిమితమైంది. కుశాల్ పెరీరా (68 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఓ దశలో లంక 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే సేనానాయకే, ప్రసన్నలు ఎనిమిదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement