టెస్టుల్లో ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న ఏకైక టెస్టులో జకీర్ హసన్‌ను ఔట్ చేసిన మసూద్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఘనత సాధించిన జాబితాలో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (1991), నీలేష్ కులకర్ణి (1997), చమిలా గమగే (2002),నాథన్ లియోన్ (2011), షామిందా ఎరంగా (2011), డేన్ పీడ్ట్ (2014), హార్డస్ విల్జోయెన్ (2016) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆఫ్గాన్‌పై బంగ్లాదేశ్ పైచేయి సాధించింది.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో(146) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఓపెనర్ మహ్మదల్ హసన్(76) పరుగులతో చెలరేగాడు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీం(41), మెహిదీ హసన్ మిరాజ్(43) పరుగులతో ఉన్నారు.
చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా
Comments
Please login to add a commentAdd a comment