అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు.
ఆసియాకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌వికెట్‌గా ఔటైన ముజీబ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరి ముజీబ్ హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్ హిట్ వికెట్‌గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. అదే విధంగా ఈ విజయంతో బంగ్లాదేశ్ తమ సూపర్- ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఇక మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ సమయంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి.
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! చెత్త కారణాలు చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment