బంగ్లాదేశ్ స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్ గాయం కారణంగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన టాస్కిన్ ఆహ్మద్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో స్పెషలిస్టుగా పెరొందిన అహ్మద్.. డైలీ స్టార్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ గురించి టాస్కిన్ చర్చించాడు. "ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. మా ప్లాన్స్‌ను వెల్లడించడానికి సరైన సమయం కాదు. కానీ ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడడమే మా ప్రధాన లక్ష్యం. అందుకు భగవంతుడి దయ కూడా కావాలి. నేను భారత్ గడ్డపై టీ20 ప్రపంచకప్, ఓ టెస్టు మ్యాచ్ ఆడాను.
భారత పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. అయితే కొన్ని పిచ్‌లకు మాత్రం బ్యాటింగ్ అనూకూలిస్తాయి. అక్కడ కచ్చితంగా పేసర్లకు మాత్రం గట్టి సవాలు ఎదురవుతుంది. కానీ బౌలింగ్ యూనిట్ సరిగ్గా రాణించగల్గితే ఏ జట్టుకైన గట్టిపోటీని ఇవ్వగలుగుతాం" అని డైలీ స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాస్కిన్ అహ్మద్ పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్ తరపున 57 వన్డేలు, 52 టీ20లు, 12 టెస్టులు ఆడిన అహ్మద్ 152 వికెట్లు పడగొట్టాడు. కాగా వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనుంది. ఐసీసీ ఇంకా వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయలేదు.
చదవండి: నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment