Bangladesh Vs India ODI Series 2022: Tamim Iqbal Ruled Out Due To Groin Injury - Sakshi
Sakshi News home page

IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి

Published Fri, Dec 2 2022 8:39 AM | Last Updated on Fri, Dec 2 2022 9:39 AM

Bangladesh skipper Tamim Iqbal ruled out of the series - Sakshi

స్వదేశంలో టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తమీమ్‌కు గజ్జ గాయమైంది.

అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచించారు. ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌కు తమీమ్‌ దూరమయ్యాడు. అయితే డిసెంబర్‌ 14న జరిగే తొలి టెస్టుకు కూడా తమీమ్‌ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.

అయితే వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్బాల్ స్థానంలో ఆ జట్టు వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఆల్‌ హసన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తొలి వన్డేకు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌ కూడా వెన్ను నొప్పితో దూరమయ్యాడు. కాగా తమీమ్‌,టాస్కిన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు దూరం కావడం కచ్చితంగా బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక  డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్, అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్‌
చదవండి:
 ENG Vs PAK: 'యార్‌..నెంబర్‌ వన్‌ బౌలింగ్‌'.. పాక్‌ జట్టును ఆడేసుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement