BAN Vs IRE 1st T20I: Bangladesh Won By 22 Runs In DLS - Sakshi
Sakshi News home page

BAN VS IRE 1st T20: తస్కిన్‌ విజృంభణ.. పసికూనలపై బంగ్లాదేశ్‌ ప్రతాపం

Published Mon, Mar 27 2023 6:30 PM | Last Updated on Mon, Mar 27 2023 6:52 PM

BAN VS IRE 1st t20: Bangladesh Won By 22 Runs In DLS - Sakshi

స్వదేశంలో బంగ్లాదేశ్‌ విజయాల పరంపర కొనసాగుతుంది. ఇటీవలే జగజ్జేత ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్‌ (3-0 తేడాతో టీ20 సిరీస్‌) చేసి జోష్‌ మీదున్న బంగ్లాదేశ్‌.. ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న హోం సిరీస్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తోంది.

3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా పులులు.. ఇవాళ (మార్చి 27) మొదలైన టీ20 సిరీస్‌కు కూడా శుభారంభం చేశారు. చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిధ్య జట్టు.. 19.2 ఓవర్ల తర్వాత 207/5 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా, వర్షం మొదలైంది. చాలా సేపు కొనసాగిన వర్షం నిర్ణీత సమయానికి కాస్త ముందు ఎడతెరిపినివ్వడంతో రిఫరీ మ్యాచ్‌ను ప్రారంభించాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 8 ఓవర్లలో 104 పరుగులుగా నిర్ధేశించారు.

ధాటిగా ఛేదనను ప్రారంభించిన ఐర్లాండ్‌ను తస్కిన్‌ అహ్మద్‌ దారుణంగా దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లో 18 పరుగులు, రెండో ఓవర్‌లో 14 పరుగులు రాబట్టి లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్న ఐర్లాండ్‌ను తస్కిన్‌ అహ్మద్‌ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. 2 ఓవర్ల తర్వాత 32/0గా ఉన్న స్కోర్‌ 4 ఓవర్ల తర్వాత 44/4గా మారింది. ఈ పరిస్థితి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని ఐర్లాండ్‌ తమవంతు ప్రయత్నం చేసి చివరికి ఓటమిపాలైంది. 2 ఓవర్లు వేసిన తస్కిన్‌ 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు.. లిట్టన్‌ దాస్‌ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోని తలుక్దార్‌ (38 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), షమీమ్‌ హొస్సేన్‌ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్‌), షకీబ్‌ (13 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మరో 4 బంతులు మిగిలుండగానే వర్షం ప్రారంభంకావడంతో బంగ్లా ఇన్నింగ్స్‌ ఆ‍క్కడే ముగిసింది. బంగ్లా-ఐర్లాండ్‌ మధ్య రెండో టీ20 మార్చి 29న జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement