బౌలింగ్‌ చేయడంలో నన్ను మించినోడు లేడు | No one is better than me with the new ball, says Pakistani seamer Mohammad Asif | Sakshi
Sakshi News home page

బౌలింగ్‌ చేయడంలో నన్ను మించినోడు లేడు

Published Sun, Dec 11 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

బౌలింగ్‌ చేయడంలో నన్ను మించినోడు లేడు

బౌలింగ్‌ చేయడంలో నన్ను మించినోడు లేడు

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్‌ చేసే బౌలర్‌ ప్రపంచంలో ఎవరూ లేరని పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ అన్నాడు. తానే అత్యుత్తమ బౌలర్‌ అని ఆసిఫ్‌ తనకు తాను కితాబిచ్చుకున్నాడు.

మ్యాచ్‌ ఆరంభంలోనే ప్రత‍్యర్థి జట్టును సాధ్యమైనంత వరకు దెబ్బతీసే సామర్థ్యం తనకు ఉందని అసిఫ్‌ చెప్పాడు. టెస్టు క్రికెట్‌లో కొత్త బంతితో వికెట్లు తీయకపోతే జట్టు చిక్కుల్లో పడినట్టేనని అన్నాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా కొత్త బంతితో రాణిస్తానని చెప్పాడు. కొత్త బంతితో ఎలా బౌలింగ్‌ చేయాలో తనకంటే బాగా ఎవరికి తెలియదని ఆసిఫ్‌ అన్నాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో నిషేధానికి గురైన ఆసిఫ్‌ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. వయసు, ఫిట్‌నెస్‌ తనకు సమస్యలు కావని 33 ఏళ్ల ఆసిఫ్‌ చెప్పాడు. గతంలో 40 ప్లస్‌ వయసులో కూడా కొందరు బౌలర్లు రాణించారని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement