భారత పర్యటనకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్‌ను నియమించాలని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్‌వై న్యూస్ రిపోర్టు ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) తమ సీనియర్ పురుషుల జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఏసీబీ ప్రతిపాదనను అతడు అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. భారత పర్యటనలో భాగంగా అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
24 గంట్లలోనే వేటు..
కాగా ఇటీవల పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సల్మాన్ బట్ ఎంపికయ్యాడు. అయితే అతడిని సెలక్షన్ ప్యానల్ కన్సల్టెంట్ మెంబర్‌గా నియమించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాడిని సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎలా నియమిస్తారని ఆ దేశ మాజీ ఆటగాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాకిస్తాన్ ఛీప్ సెలక్టర్ వహాబ్ రియాజ్.. 24 గంటలు తిరగకముందే సల్మాన్‌ను తన పదవి నుంచి తప్పించాడు.
చదవండి: National T20 Cup: దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు!
Comments
Please login to add a commentAdd a comment