ఆసియాకప్-2023 బుధవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఇక టీమిండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తమ ఆసియాకప్ ప్రయణాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్2న కాండీ వేదికగా దాయాదుల పోరు జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత జట్టును టార్గెట్ చేస్తూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వాఖ్యలు చేశాడు. ప్రస్తుత భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా అంత గొప్ప ఆటగాళ్ల లేరని భట్ మరోసారి విషం చిమ్మాడు.
"భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వారితో పాటు యువ ఆటగాళ్లు ఉన్నారు. వారు చాలా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. ముఖ్యంగా ఇటువంటి హై వోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒత్తడిని తట్టుకోలేరు. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అద్భుతంగా ఆడినప్పుడే భారత్ చాలా సార్లు గెలుపొందింది.
మిగితా ఆటగాళ్లు బాధ్యత తీసుకుని ఆడినప్పుడు టీమిండియా గెలవడానికి చాలా కష్టపడింది. టీమిండియా బ్యాటింగ్ పరంగా చాలా బలహీనంగా ఉంది. పాక్ బౌలర్లు కోహ్లి, రోహిత్ వంటి రెండు పెద్ద వికెట్లను పడగొడితే సగం మ్యాచ్ గెలిచనట్లే.
అదే పాకిస్తాన్‌లో బాబర్, రిజ్వాన్, ఫఖర్, షాదాబ్, షాహీన్, హరీస్ రవూఫ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు చాలా అద్భుతంగా ఉంది. నా వరకు అయితే పాకిస్తాన్ టైటిల్ ఫేవరేట్" అని తన యూట్యూబ్ ఛానల్‌లో భట్ పేర్కొన్నాడు.
చదవండి: తిలక్ వర్మకు చోటు దక్కడం చాలా సంతోషం: విజయ్ దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment