వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ వరుసగా హాఫ్ సెంచరీలు బాది 184 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు ముందు కిషన్ మంచి ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేడు కాబట్టి కిషన్‌కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి.
అదే విధంగా వరల్డ్‌కప్‌కు ముందు ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో కిషన్‌కు ప్రస్తుతం విండీస్ సిరీస్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇచ్చారు. కిషన్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ జట్టులో మాత్రం చోటు అనుమానంగానే ఉంది. రోహిత్, కెఎల్ రాహల్ అందుబాటులోకి వస్తే అతడికి జట్టులో చోటు కష్టమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కిషన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ఇషాన్ కిషన్ పట్ల భారత జట్టు వ్యవహరిస్తున్న తీరు గందరగోళంగా ఉంది. అతడిని ప్రయోగాలకు ఎందుకు బలిచేస్తుందో నాకు అర్ధం కావడం లేదు. భారత జట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే తను డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడు కేవలం సెకెండ్ ఆప్షనే అని భారత జట్టు మెనెజ్‌మెంట్ అంగీకరించాలి.
అతడు ఒకే ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినా రెండో ఆప్షన్‌గానే ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల ఆటగాడి ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తింటుంది. ఆటగాడి శ్రమకు తగ్గ ఫలితం దక్కాలి. అంతే తప్ప సెకెండ్ ఆప్షన్‌గా భావించకూడదు" అని బట్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: #Riyan Parag: నేను అవన్నీ పట్టించుకోను.. చూయింగ్ గమ్ నమిలితే తప్పు! అది నా ఇష్టం
Comments
Please login to add a commentAdd a comment