Ind Vs WI 2nd Test: Ashwin Bags Two As WI Post 76/2 At Stumps, Need 289 To Level Series - Sakshi
Sakshi News home page

IND Vs WI 2nd Test: రోహిత్‌, కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా

Published Mon, Jul 24 2023 7:48 AM | Last Updated on Mon, Jul 24 2023 8:40 AM

Ashwin bags two as WI post 76 2 at Stumps - Sakshi

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 181/2 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను భారత్‌ డిక్లేర్‌ చేసింది.

భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్‌(38), రోహిత్‌ శర్మ(44 బంతుల్లో 57), కిషన్‌(34 బంతుల్లో 52) పరుగులతో రాణించారు.  తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది.

క్రీజులో చంద్రపాల్‌(24), బ్లాక్‌వుడ్‌(20) పరుగులతో ఉన్నారు. విండీస్‌ కోల్పోయిన రెండు వికెట్లు కూడా స్పిన్నర్‌ అశ్విన్‌ పడగొట్టినివే కూడా గమనార్హం. అంతకుముందు భారత స్పీడ్‌స్టర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (5/60) నిప్పులు చెరిగే బౌలింగ్‌ స్పెల్‌తో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్లలో బ్రాత్‌వైట్‌(75) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్‌ చేతిలో ఓటమి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement