Ind Vs WI 2023: Ishan Kishan Attempts Alex Carey Like Stumping, But Fails Against Jason Holder - Sakshi
Sakshi News home page

IND Vs WI 2023: ఏంటి కిషన్‌.. తొలి మ్యాచ్‌లోనే ఇలా అయితే ఎలా? తెల్లముఖం వేశావుగా

Published Sat, Jul 15 2023 10:03 AM | Last Updated on Sat, Jul 15 2023 10:39 AM

Ishan Kishan attempts Alex Carey like stumping - Sakshi

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డొమినికా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచి అతిథ్య విండీస్‌ను చిత్తు చేసింది. భారత విజయంలో అరేంట్ర ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌, వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషించారు.

జైశ్వాల్‌(171) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. అశ్విన్‌ 12 వికెట్ల(రెండు ఇన్నింగ్స్‌లు కలిపి)తో సత్తా చాటాడు. ఇక కరీబియన్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 150 పరుగులకి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌‌లో 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. .టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల భారీ ఆధిక్యం దక్కగా.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లు బ్యాటింగ్ చేసి, 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకి ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది.

మరో అలెక్స్‌ క్యారీ అవుదామనుకున్నావా..
ఇక తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ తన చర్యతో వార్తల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ మాదిరి కిషన్‌ స్టంపౌట్‌ చేసే ప్రయత్నం చేశాడు. విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 31 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతికి హోల్డర్‌ కట్‌షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాట్‌ మిస్స్‌ కావడంతో హోల్డర్‌ కాసేపు క్రీజులో అలా ఉన్నాడు. 

ఈ సమయంలో అధిక తెలివి ఉపయోగించిన కిషన్‌ హోల్డర్ క్రీజు వదిలి వెళ్లే వరకు వేచి ఉన్నాడు. హోల్డర్‌ ఓవర్‌ పూర్తి అయిందని క్రీజును వదిలి ముందుకు వెళ్లగానే కిషన్‌ వెంటనే బెయిల్స్‌ పడగొట్టాడు. దీంతో సంపౌట్‌కు అప్పీల్‌ చేశాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌లు మాత్రం ఓవర్‌ డెడ్‌ అయిందని చెప్పడంతో కిషన్‌ తెల్లముఖం వేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కిషన్‌కు ఇదే తొలి మ్యాచ్‌ కావడం గమనార్హం. ఈ క్రమంలో కిషన్‌ తీరును కొంత మంది తప్పుబడుతున్నారు. తొలి మ్యాచ్‌లోనే ఇలా చేయడం సరికాదు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక యాషెస్‌ రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టోను ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ క్యారీ ఇదే తరహాలో ఔట్‌ చేశాడు.

ఆసీస్‌ బౌలర్‌ గ్రీన్‌ వేసిన   బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్‌ పడగొట్టాడు. బంతి డెడ్‌ కాలేదని భావించిన థర్డ్‌ అంపైర్‌.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది తీవ్ర వివాదస్పదమైంది.
చదవండి: Asia Games: జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌కు చోటు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement