
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో కిషన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 33 బంతుల్లోనే కిషన్ అర్ధ శతకాన్ని సాధించాడు. ఓవరాల్‌గా 34 బంతులు ఎదుర్కొన్న కిషన్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక తన తొలి హాఫ్ సెంచరీతో కిషన్ రికార్డుల మోత మోగించాడు.
కిషన్ సాధించిన రికార్డులు ఇవే..
►టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా కిషన్ నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నాడు. 2022లో రిషబ్ పంత్, శ్రీలంకపై 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
►అదే విధంగా టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన రెండో వికెట్ కీపర్‌గా కిషన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. 2006లో పాకిస్తాన్‌పై ధోనీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో ధోని 17 ఏళ్ల రికార్డును కిషన్ బ్రేక్ చేశాడు.
►ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన నాలుగో భారత బ్యాటర్‌గా కిషన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 152.94 స్ట్రైక్ రేట్‌తో కిషన్ బ్యాటింగ్ చేశాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(161.81) తొలి స్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన అశ్విన్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
That's a smashing way to bring your maiden Test 50*@ishankishan51
— FanCode (@FanCode) July 23, 2023
.
.#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/WIFaqpoGiD
Comments
Please login to add a commentAdd a comment