
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్‌లో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. బార్బడోస్ వేదికగా జూలై 27న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా అతిథ్య విండీస్‌తో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం జట్టు మెనెజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఇషాన్ కిషన్, సంజూ శాసంన్ రూపంలో ఇద్దరి వికెట్ కీపర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో తొలి వన్డేకు తుది జట్టులో వీర్దిరిలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తెలియక ద్రవిడ్, రోహిత్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత జట్టు పరిస్ధితుల దృష్ట్యా సంజూ శాంసన్‌కే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుదక్కే అవకాశం ఉంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కిషన్‌కు మిడిలార్డర్‌లో ఆడిన పెద్దగా అనుభవం లేదు. అతడు ఓపెనర్‌గానే చాలా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. అయితే జట్టులో ఇప్పటికే రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లగా తమ స్ధానాలను పదిలం చేసుకున్నారు. కాబట్టి కిషన్ కంటే మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే అనుభవం ఉన్న సంజూ వైపే జట్టు మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరోవైపు మణికట్టు స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరో ఒకరికే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కనుంది.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ , సిరాజ్
చదవండి: IND Vs WI ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment