
టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఏన్సీఏలో డెడికేటెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పోగ్రామ్‌ను బీసీసీ నిర్వహించనుంది. ఈ పోగ్రామ్‌లో కిషన్‌తో పాటు మరి కొంతమంది బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు పాల్గొనున్నారు.
ఆఖరి రెండు అంతర్జాతీయ సిరీస్‌లు గానీ దేశీయ టోర్నమెంట్‌లలో భాగం కాని సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు ఏన్సీఏ నుంచి పిలుపుచ్చింది. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఆటగాళ్లను ఫిజికల్‌గా సిద్దం చేయడానికి ఈ పోగ్రాంను బీసీసీఐ నిర్వహిస్తుంది. కాగా వచ్చే నెలలో విండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. ఆతిధ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
జూలై 12 నుంచి డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టులో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్టు జూలై 3న కరేబియన్ దీవులకు పయనం కానుంది. ఇక విండీస్ టూర్‌కు భారత జట్టును జూన్ 27న బీసీసీఐ ప్రకటించనుంది. జైశ్వాల్, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కే ఛాన్స్ ఉంది.
చదవండి: Graeme Smith On Rohit Sharma: రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే అదొక్కటే మార్గం