
Salman Butt questions This Bowler exclusion from India’s T20 WC squad: టీ20 ప్రపంచకప్- 2021 టోర్నీకి టీమిండియా తమ అత్యుత్తమ జట్టును ఎంపిక చేయలేదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నాడు. గంటకు 145 కి.మీ. వేగంతో బంతులు విసరగల బౌలర్లు లేనపుడు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు సులభంగా పరుగులు రాబట్టగలుగుతారని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మహ్మద్ సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్టర్లను ప్రశ్నించాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2021లో టోర్నీలో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి సేన న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. వరుసగా రెండో పరాజయంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు.. అక్టోబరు 31నాటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై విమర్శలు వస్తున్నాయి.
కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లతో ఓపెనింగ్ చేయించడం, వన్‌డౌన్‌లో రోహిత్ శర్మను పంపడం వంటి ప్రయోగాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ ఆటగాళ్లు టీమిండియా ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు.
ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. ‘‘నాకు తెలిసి భారత జట్టు తమ బెస్ట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగలేదు. ఐపీఎల్‌లో మంచి ఎకానమీ ఉన్న బౌలర్‌ను మీరెందుకు పక్కన పెట్టారు? ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించిన ఆటగాణ్ని ఎందుకు విస్మరించారు. అవును.. సిరాజ్(ఐపీఎల్-2021లో 11 వికెట్లు) గురించే నేను మాట్లాడుతున్నా. మీకు చాలా మంది ఫాస్ట్‌బౌలర్లు ఉండవచ్చు. కానీ తననెందుకు ఎంపిక చేయలేదు.
పేస్ దళం బలంగా ఉంటే బాగుంటుంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ.... బౌన్సర్లు, యార్కర్లు సంధించగల బౌలర్ ఉంటేనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అటాక్ చేయడానికి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ మీరు అలా చేయలేకపోయారు. బ్యాటర్లను భయపెట్టలేకపోయారు’’ అని టీమిండియా ఆట తీరును విమర్శించాడు. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీశాడు.
స్కోర్లు:
ఇండియా- 110/7 (20)
న్యూజిలాండ్- 111/2 (14.3)
చదవండి: Virat Kohli:: ఓటమికి చింతిస్తున్నాం.. ఇక ఇంటికే.. ‘కోహ్లి ట్వీట్’ వైరల్
Comments
Please login to add a commentAdd a comment