Salman Butt suggest three changes for Team India: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా నేడు కీలక పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఏటువంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా జట్టులో మూడు మార్పులు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సూచించాడు. భారత తుది జట్టులో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని భట్ తెలిపాడు. అదే విధంగా రవి అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అశ్విన్ ఒక అనుభవం గల ఆటగాడని.. బ్యాట్‌తోను, బాల్‌తోను రాణించగలడని అతడు అభిప్రాయపడ్డాడు.
"ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని టీమిండియా ఉపయోగించుకోవాలని నేను చాలా కాలంగా సూచిస్తున్నాను. రవిచంద్రన్ అశ్విన్‌ని కూడా జట్టులోకి తీసుకురావాలి. అతడు సరైన స్పిన్నర్. అతడు వికెట్ టేకింగ్ బౌలర్. అశ్విన్‌ను జట్టులో చేర్చుకోవడం వల్ల మరింత బలం చేకూరుతుంది. ఆదే విధంగా హార్దిక్ పాండ్యా ఫిట్‌గా లేకుంటే, అతడి స్ధానంలో శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకురావాలి. ఎందుకంటే అతడు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు" అని బట్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: నేడు న్యూజిలాండ్‌తో భారత్ కీలక పోరు.... ఓడితే ఇక అంతే!
Comments
Please login to add a commentAdd a comment