టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ విధ్వంసకర ఆటగాడని, అతడికి ఎవరూ సాటి రారు అని బట్ కొనియాడాడు. రోహిత్‌ను పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, రిజ్వాలన్‌తో పోల్చడం సరికాదని బట్ అభిప్రాయపడ్డాడు.
"రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అటువంటి ఆటగాడిని బాబర్, రిజ్వాన్‌లతో పోల్చడం సరికాదు. కోహ్లిలో ఉన్న సగం ఫిట్‌నెస్ రోహిత్‌కు ఉంటే అతడికి ఎవరూ సాటి రారు. కేవలం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ మాత్రమే రోహిత్ శర్మ వంటి ఆట తీరును కలిగి ఉన్నాడు" అని యూట్యూబ్ ఛానల్‌లో బట్ పేర్కొన్నాడు.
కాగా ఆసియాకప్-2022లో రోహిత్ శర్మ అంతగా రాణించలేకపోయాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిజ్వాన్ మాత్రం ఈ టోర్నీలో అదరగొట్టాడు. 281 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా రిజ్వాన్ నిలిచాడు.
చదవండి: Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క దంపతుల చక్కర్లు
Comments
Please login to add a commentAdd a comment