గత కొన్ని నెలలగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో అక్రమ్ పోల్చాడు. కాగా గిల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023లో ఈ యువ ఓపెనర్ అదరగొట్టాడు.
ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 890 పరుగులు చేసి ఈ ఏడాది సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. అంతకుముందు ఈ ఏడాదిలో న్యూజిలాండ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ, అదే జట్టుపై టీ20 సెంచరీ సాధించాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా గిల్ సెంచరీతో చెలరేగాడు.
ఇక ఐపీఎల్‌లో దుమ్మురేపిన గిల్.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఈ నేపధ్యంలో స్టార్ స్పోర్ట్స్’లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో అక్రమ్ పాల్గొన్నాడు.
"ఒకవేళ నేను గిల్ వంటి అద్భుతమైన ఆటగాడికి టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ చేస్తే.. వన్డేలలో సచిన్‌కు తొలి 10 ఓవర్లలో ఎలా వేసేవాడినో అలాగే వేస్తా. అతడు కచ్చితంగా సచిన్ అంతటి వాడు అవుతాడని" అక్రమ్ కొనియాడాడు. ఇక గిల్‌ను ఉద్దేశించి అక్రమ్ చేసిన వాఖ్యలపై మరోపాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ స్పందించాడు.
"గిల్‌కి బౌలింగ్ చేయడం సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడం ఒక్కటే అని వసీం భాయ్ అన్నాడు. నాకు తెలిసి గత కొన్ని రోజులగా చాలామంది గిల్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. గొప్ప గొప్ప ఆటగాళ్లు గిల్‌ను సచిన్ వంటి దిగ్గజ క్రికెటర్లతో పోల్చుతున్నారు. ముఖ్యంగా అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్ గిల్‌ను ప్రశంసించడం.. అది అతడికి దక్కిన గౌరవం. నిజానికి గిల్ కూడా అందుకు అర్హుడు. అతడు కొన్ని నెలలగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు ఇదే దూకుడును రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నా" అని తన యూట్యూబ్ ఛానల్‌లో భట్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment