ప్రపంచంలోని క్రికెట్ జట్ల కెప్టెన్లందరిలో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ సారథి అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. గొప్ప విజయాలెన్నో సాధించినా నిరాండంబరంగా ఉండటం అతడికే చెల్లిందన్నాడు. అందుకే వరల్డ్ నంబర్ 1 కెప్టెన్ అంటే తనకు ధోనినే గుర్తుకొస్తాడని సల్మాన్ పేర్కొన్నాడు.
కాగా 2004లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ధోని. అనతికాలంలోనే టీమిండియా పగ్గాలు చేపట్టి.. మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ గెలిచి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.
ఇటు వికెట్ కీపర్ బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చిన ధోని ఖాతాలో ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు ఉండటం విశేషం. ధోని హయాంలోనే.. ప్రస్తుతం టీమిండియా ముఖచిత్రంగా మారిన విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంచెలంచెలుగా ఎదిగారన్న సంగతి తెలిసిందే.
తలా ప్రోత్సాహంతో రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ కాగా.. కోహ్లికి పెద్దన్నలా మారి అన్ని విషయాల్లో ధోని అతడికి అండగా నిలిచాడు. ఇక సంచలన నిర్ణయాలతో జట్టు రూపురేఖలు మార్చిన భారత కెప్టెన్లలో ధోనికి చోటు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మైదానంలో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న ధోని లీగ్ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ నేపథ్యంలో నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పాక్ మాజీ సారథి సల్మాన్ బట్.. ధోని గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘‘గత 15 ఏళ్ల చరిత్రను ఒక్కసారి గమనిస్తే.. ప్రపంచంలో నంబర్ 1 కెప్టెన్ అంటే మహేంద్ర సింగ్ ధోని గుర్తుకువస్తాడు. మైదానంలో అతిగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. సహచరులతో గానీ, ప్రత్యర్థులతో గానీ గొడవ పడిన సందర్భాలు కూడా లేవు.
అతిపెద్ద విజయాలు సాధించిన సమయంలో జట్టు సభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నపుడు కూడా ఓ పక్కన సాధారణ వ్యక్తిలా నిలబడతాడు. అంత నిరాండంబరంగా, ప్రశాంతంగా ఉండే వ్యక్తులు ఎవరుంటారు?’’ అంటూ ధోనిని కొనియాడాడు. కాగా పాకిస్తాన్‌కు 1992లో.. వన్డే వరల్డ్‌కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజంలను కాదని దాయాది జట్టు మాజీ సారథి.. ధోని పేరును చెప్పడం విశేషం.
చదవండి: 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..!
గిల్, జైశ్వాల్, కిషన్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ స్టార్!
Comments
Please login to add a commentAdd a comment