టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శరీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని, అతడు తన శరీర దృఢత్వం పెంచుకోవాలని బట్ అభిప్రాయపడ్డాడు. కాగా కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న హార్దిక్ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లోను దారుణంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
“హార్దిక్ పాండ్యా శరీరం చాలా బలహీనంగా ఉంది. ఇలా అయితే అతడు ఒక్క ఫార్మాట్‌లో కూడా రాణించలేడు. అతడు తన బరువును, కండలను పెంచుకోవాలి. పాండ్యా తిరిగి 4 ఓవర్లు వేయగలిగేలా కష్టపడాలని రవిశాస్త్రి ఇటీవల చెప్పాడు. ప్రస్తుతం 4 ఓవర్లు కూడా వేయలేని పరిస్థితుల్లో అతడు ఉన్నాడు" అని బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకోలేదు. దీంతో అతడు రానున్న మెగా వేలంలో పాల్గొననున్నాడు.
చదవండి: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్.. బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా!
Comments
Please login to add a commentAdd a comment