తాజాగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సూర్య ఆటతీరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను డివిలియర్స్‌తో పొల్చడాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తప్పు బట్టాడు.
డివిలియర్స్‌కు ఉన్న ప్రతిభ ప్రపంచ క్రికెట్‌లో మరే ఏ ఇతర ఆటగాడికి లేదని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరగిన టీ20 సిరీస్‌లో సూర్య సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం సూర్య టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు.
క్రికెట్ ప్రపంచంలో డివిలియర్స్ లాంటి ఆటగాడే లేడు
"ఏబీ డివిలియర్స్‌తో ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడం సరికాదు. అతడి ప్రతిభకు ఎవరూ సాటిరారు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి జట్టుకు వెన్నులో వణుకు పుడుతోంది. ఏబీడిని తొందరగా ఔటచేయలేకపోతే.. ఓటమి తప్పదని ప్రత్యర్ధిజట్టుకు ముందే తెలుసు.
రూట్, విలియమ్సన్, కోహ్లితో పాటు ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా నిలిచిన డివిలియర్స్.. తన కెరీర్‌లో అద్భుతమైన సెంచరీలు కూడా సాధించాడు. బహుశా పాంటింగ్‌కు జెట్ లాగ్ వదిలినట్లు లేదు. అందుకే ఇలా అంటున్నాడేమో" అని సల్మాన్ బట్ యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
సూర్యని వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు
"సూర్యకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అంత అనుభవం లేదు. అతడు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాడు. సూర్య కూడా అద్భుమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడిని డివిలియర్స్‌తో పొల్చి పాటింగ్ తొందరపడ్డాడు.
ఎందుకంటే సూర్యకుమార్ ఇంకా ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఆడలేదు. ప్రస్తుతం క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడు లేడన్నది వాస్తవం. సూర్యని ఎవరతోనైనా పోల్చాలి అనుకుంటే.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు" అని బట్ అన్నాడు.
చదవండి: Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్ హుడా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment