Ricky pointing
-
రికీ పాంటింగ్ కి రూల్స్ అర్థం కాలేదా ?
-
జెట్ లాగ్ వల్లేనేమో! ఏబీతో సూర్యను పోల్చడమేంటి?: పాక్ మాజీ కెప్టెన్
తాజాగా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సూర్య ఆటతీరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను డివిలియర్స్‌తో పొల్చడాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తప్పు బట్టాడు. డివిలియర్స్‌కు ఉన్న ప్రతిభ ప్రపంచ క్రికెట్లో మరే ఏ ఇతర ఆటగాడికి లేదని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరగిన టీ20 సిరీస్‌లో సూర్య సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం సూర్య టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో డివిలియర్స్ లాంటి ఆటగాడే లేడు "ఏబీ డివిలియర్స్‌తో ప్రస్తుత తరం క్రికెటర్లతో పోల్చడం సరికాదు. అతడి ప్రతిభకు ఎవరూ సాటిరారు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ధి జట్టుకు వెన్నులో వణుకు పుడుతోంది. ఏబీడిని తొందరగా ఔటచేయలేకపోతే.. ఓటమి తప్పదని ప్రత్యర్ధిజట్టుకు ముందే తెలుసు. రూట్, విలియమ్సన్, కోహ్లితో పాటు ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా నిలిచిన డివిలియర్స్.. తన కెరీర్లో అద్భుతమైన సెంచరీలు కూడా సాధించాడు. బహుశా పాంటింగ్‌కు జెట్ లాగ్ వదిలినట్లు లేదు. అందుకే ఇలా అంటున్నాడేమో" అని సల్మాన్ బట్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. సూర్యని వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు "సూర్యకు ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అంత అనుభవం లేదు. అతడు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాడు. సూర్య కూడా అద్భుమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడిని డివిలియర్స్‌తో పొల్చి పాటింగ్ తొందరపడ్డాడు. ఎందుకంటే సూర్యకుమార్ ఇంకా ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఆడలేదు. ప్రస్తుతం క్రికెట్లో ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడు లేడన్నది వాస్తవం. సూర్యని ఎవరతోనైనా పోల్చాలి అనుకుంటే.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో పోల్చవచ్చు" అని బట్ అన్నాడు. చదవండి: Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్ హుడా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్ కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక టెస్ట్ క్రికెట్లో 8 వేల పరుగుల చేసిన ఆరో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. విరాట్ కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాదించాడు. 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి సచిన్ తొలి స్ధానంలో ఉన్నాడు. అదే విధంగా కోహ్లి తప వందో మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన పాంటింగ్ 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్.. మేనేజ్మెంట్కు ధన్యవాదాలు: కోహ్లి -
టెక్నిక్ మార్చిన పృథ్వీ షా
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేవలం 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సికర్లు బాదాడు. పృథ్వీ షా ఇచ్చిన మెరుపు ఆరంభంతో ఢిల్లీ జట్టుకు భారీ స్కోరు చేయగలిగే అవకాశం లభించింది. ఐతే గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే అతడి బ్యాటింగ్ వైఖరిలో కొంత మార్పు కనపించింది. ఈ విషయమై ఇంగ్లాడ్ క్రికెటర్ కెవిన్ పీటర్స్సెన్ కమెంట్రీ చేస్తూ ఢిల్లీ టీమ్ కోచ్ రికీ పాంటింగ్‌ను పృథ్వీ షా బ్యాటింగ్ గురించి అడిగాడు. అతడు మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మెన్ అని.. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని పాంటింగ్ మెచ్చుకున్నాడు. గత రెండేళ్లుగా పృథ్వీ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను అనలైస్ చేసుకున్నాడని, ఎక్కువగా ఆఫ్ సైడ్ షాట్లు ఆడుతున్నాడని పాంటింగ్ అన్నాడు. 'ఒక కోచ్‌గా నేను అతడితో కొన్నిసార్లు మాట్లాడాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. అలాంటి ప్లేయర్‌కు ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఫార్మాట్లో వారి ఆటను ఆడనివ్వాలి. పృథ్వీ మంచి టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మా జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు' పాంటింగ్ పేర్కొన్నారు. -
'నా కెరీర్లో ఆ స్పెల్ ఎప్పటికి మరిచిపోను'
-
సచిన్ ఎందుకు మాట మార్చాడు
మెల్బోర్న్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సచిన్‌తో కలిసి ఆడినా...‘మాస్టర్’పై రికీ పాంటింగ్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కాడు. ఐదేళ్ల క్రితం నాటి ‘మంకీ గేట్’ వివాదాన్ని ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మరోసారి లేవనెత్తాడు. ఈ ఉదంతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాత్రను పాంటింగ్ ప్రశ్నించాడు. ‘ది క్లోజ్ ఆఫ్ ప్లే’ పేరిట పాంటింగ్ ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ వివాదం సమయంలో సచిన్ వాస్తవాలు ఎందుకు మాట్లాడలేదని పాంటింగ్ ప్రశ్నించాడు. ‘ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని మొదట నాతో చెప్పాడు. హర్భజన్‌ను ఆపేందుకు ప్రయత్నించానని అన్నాడు. విచారణలో మాత్రం భజ్జీ మంకీ లేక బిగ్ మంకీ అనగా తాను వినలేదని అతడు ‘తేరి మా కీ’ అనుండొచ్చని, అది మంకీగా వినిపించిందేమో అని జడ్జికి చెప్పాడు. అయితే సచిన్ టెండూల్కర్ మొదటగా ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ మైక్ ప్రాక్టర్కు ఎందుకు తెలపలేదో నాకు అర్థం కాకుండా ఉంది’ అని తన పుస్తకంలో రాసుకున్నాడు. ఐదేళ్ల క్రితం మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా తన పుస్తకంలో సచిన్ పాత్రను విమర్శిస్తూ రాశాడు. 2008లో భారత జట్టు ఆసీస్ పర్యటన సందర్భంగా స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన గొడవకు ‘మంకీ గేట్’గా పేరు వచ్చింది. తనను మంకీగా సంభోదిస్తూ భజ్జీ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని సైమండ్స్ ఆరోపించాడు. మొదట హర్భజన్‌పై మ్యాచ్ రిఫరీ మూడు టెస్టుల నిషేధం విధించినప్పటికీ జస్టిస్ జాన్ హాన్సెన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సచిన్ సాక్ష్యంతో భజ్జీకి క్లీన్చిట్ వచ్చింది.