India Vs Nz 2nd Test Day 4 2021 Highlights & Updates.. సమయం 10:20Am ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 540 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు సాధించగా, కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా టెస్ట్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సాధించాడు.
సమయం 9:50Am: న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల చేసిన రచిన్ రవీంద్ర, జయంత్ యాదవ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా స్కోరు కంటే న్యూజిలాండ్ ఇంకా 377 పరుగులు వెనుకబడి ఉంది. కాగా టీమిండియా విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 53 ఓవర్లకు కివీస్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ నికోలస్,కైల్ జామీసన్ ఉన్నారు.
సమయం 9:30Am: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు నష్టానికి 140 పరుగులు చేసింది. కాగా భారత్ విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర, హెన్రీ నికోలస్ ఉన్నారు.
భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: BAN Vs PAkK: నీటిలో ఫీల్డింగ్ చేసిన షకీబ్ అల్ హసన్.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment