IND vs NZ: Virat Kohli Hilarious Reactions Recorded as Spider Cam Gets Stuck Near Pitch - Sakshi
Sakshi News home page

IND Vs NZ: ఏంటి అశ్విన్‌.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్‌ అనుకున్నావా..

Published Mon, Dec 6 2021 9:17 AM | Last Updated on Mon, Dec 6 2021 10:07 AM

Spidercam malfunction forces early tea Virat Kohli and Co - Sakshi

IND vs NZ 2nd Test: Virat Kohli Hilarious Reactions Recorded as Spider Cam Gets Stuck Near Pitch: ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ రెండో టెస్ట్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 'స్పైడర్‌క్యామ్' ఆటకు అంతరాయం కలిగించింది. టీ విరామానికి కొన్ని ఓవర్ల ముందు ఓ స్పైడర్‌క్యామ్ టెక్నికల్ లోపంతో కిందకు పడిపోయింది. స్పైడర్ క్యామ్ పైకి వెళ్లకపోకుండా రెండు అడుగుల ఎత్తులో వేలాడింది. కంట్రోల్ రూం నుంచి దానిని తిరిగి పొందడంలో విఫలమయ్యారు.  దీంతో టెక్నికల్ లోపాన్ని గ్రహించిన ఆన్-ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరి షెడ్యూల్ టైం కంటే ముందే టీబ్రేక్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో ఫీల్డ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ , రవిచంద్రన్ అశ్విన్‌ స్పైడర్‌క్యామ్‌తో సరదాగా గడిపారు. స్పైడర్ క్యామ్‌ ముందుకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ‘నీకు ఇక్కడేం పని, పైకి వెళ్లు...’ అని సైగలతో సూచించడం, సూర్యకుమార్ యాదవ్ వచ్చి  చెక్ చేయడం ఈ కెమెరాలో రికార్డైంది. అశ్విన్ అయితే బాహుబలిలో ప్రభాస్‌లా శివలింగాన్ని ఎత్తుకున్నట్లుగా కెమెరాను పైకి నెట్టుతూ పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌పై నెటిజన్లు మీమ్స్‌ వర్షం కురిపిస్తున్నారు. ఏంటి అశ్విన్‌.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్‌ అనుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Shreyas iyer: అహ్మదాబాద్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! రూ.15 కోట్లు ఆఫర్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement