India Vs Nz 1st Test Day 2 2021 Highlights Updates.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 69 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 38 పరుగులు, ఛతేశ్వర్ పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భారత్‌కు 332 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకు ముందు 325 పరుగులకు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగించగా.. కివీస్ 62 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
5:00 PM: రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. మయాంక్ అగర్వాల్ 25, ఛతేశ్వర్ పుజారా 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 325 పరుగులు ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 పరుగులు ఆలౌట్
3 : 40 PM: టీమిండియాతో రెండో టెస్టులో భాగంగా న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. కేవలం 62 పరుగులుకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. రెండో రోజు ఆటలో భాగంగా తొలుత భారత్ 325 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్ కేవలం 62 పరుగులకే కుప్పకూలడం విశేషం. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
3:15 PM: ఎనిమిది వికెట్లు కోల్పోయిన కివీస్
►భారత బౌలర్ల విజృంభణతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
3:07 PM: న్యూజిలాండ్ ప్రస్తుత స్కోరు: 51/6 (18.4). టీమిండియా కంటే ఇంకా 273 పరుగులు వెనుకబడి ఉంది.
2:48 PM: భారత బౌలర్లు న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అద్భుతమైన బంతులు సంధిస్తూ వరసుగా ఒక్కొక్కరిని పెవిలియన్ చేరుస్తున్నారు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా... అక్షర్ పటేల్, అశ్విన్, జయంత్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో 38 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. టీమిండియా కంటే 287 పరుగుల వెనుకబడి ఉంది.
►ఆరు వికెట్లు కోల్పోయిన కివీస్
2: 30PM: భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు విలవిల ఆడుతున్నారు. 31 పరుగుల వద్ద కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన నికోలస్.. ఆశ్విన్ బౌలింగ్ క్లీన్ బౌల్డయ్యాడు.
2: 00PM: న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
స్కోరు: న్యూజిలాండ్ స్కోరు: 27/4
1: 30 PM: రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను దెబ్బకొడుతున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌లతో పాటు రాస్ టేలర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులుకు ఆలౌటైంది. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచరికార్డు సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 వికెట్లు సాధించాడు.
దీంతో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతక ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఇక భారత్ ఇన్నింగ్స్‌లో చేసిన మయాంక్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
12:20 Pm: టీమిండియా మయాంక్ అగర్వాల్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయింది. 150 పరుగులు చేసిన మయాంక్ అజాజ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే ఏడు వికెట్లు పడగొట్టాడు.
11:40 Am రెండో రోజు ఆట మెదలు పెట్టిన టీమిండియా లంచ్ విరామానికి 98 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 146, అక్షర్ పటేల్32 పరుగులతో క్రీజులో ఉన్నారు.
10:35.. టీమిండియా ప్రస్తుత స్కోర్: 85 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 135, అక్షర్ పటేల్22 పరుగులతో క్రీజులో ఉన్నారు.
9:58AM: రెండో రోజు ఆట మెదలు పెట్టిన టీమిండియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 72 ఓవర్ వేసిన అజాజ్ పటేల్.. వరుస బంతుల్లో వృద్ధిమాన్ సాహా, ఆశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం భారత్ 79 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, అక్షర్ పటేల్12 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే ఆరు వికెట్లు సాధించాడు.
9:30 AM న్యూజిలాండ్ జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచిన భారత్ రెండో రోజు ఆటమెదలు పెట్టింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మెదటి రోజు ఆటముగిసే సమయానికి 70 ఓవర్లలో 4వికెట్లు నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 120, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.
భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌథీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్
చదవండి: Rohit sharma: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!
Incredible achievement as Ajaz Patel picks up all 10 wickets in the 1st innings of the 2nd Test.
— BCCI (@BCCI) December 4, 2021
He becomes the third bowler in the history of Test cricket to achieve this feat.#INDvNZ @Paytm pic.twitter.com/5iOsMVEuWq
Comments
Please login to add a commentAdd a comment