వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌లో భారత్ ఓటమిపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తనదైన శైలిలో విశ్లేషించారు. ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి స్ర్టైక్ రేట్‌పైనా పలువురు వేలెత్తిచూపడంతో పాటు ఈ టూర్‌లో విరాట్ కోహ్లీ ఫాంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాట్స్‌మెన్‌లు తరచూ స్ర్టైక్ రొటేట్ చేయకపోవడం సమస్యలకు కారణమని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు. ఎక్కువ సమయం క్రీజ్‌లోకి రాకుండా ఉంటే నాన్ స్ర్టైకర్ తన బ్యాటింగ్ రిథమ్‌ను కోల్పోతాడని అన్నారు. రహానే క్రీజ్ వద్ద కుదురుకుని భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నించాలని వ్యాఖ్యానించారు. ‘పుజారా చాలా పరుగులు చేశాడు..అయితే అతను స్ర్టైక్ రొటేట్ చేయడంపై దృష్టిసారించాలి..లేకుంటే తన బ్యాటింగ్ భాగస్వామి ఇబ్బందుల్లో పడతాడ’ని పేర్కొన్నారు. మరోవైపు భారత బ్యాట్స్‌మెన్లు క్రీజులో కుదురుకోకుండా కివీస్ బౌలర్లు కట్టడి చేశారని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment