Vengsarkar
-
అశ్విన్‌ను ఎందుకు తీసుకోవడంలేదు.. దీనిపై విచారణ జరిపించాలి
Vengsarkar Comment on Ashwin: టీ20 ప్రపంచకప్2021లో భారత తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నమెంట్లో వరుసగా టీమిండియా ఓడిపోతున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై విచారణ జరిపించాలని అతడు డిమాండ్ చేశాడు. “అశ్విన్‌ని ఇంత కాలం ఎందుకు తీసుకోవడం లేదు? ఇది విచారణకు సంబంధించిన అంశం. ఫార్మాట్లలో అతడు 600 కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసిన అత్యుత్తమ స్పిన్నర్. అతడు అనుభవం ఉన్న స్పిన్నర్. అతడిని ఎందుకు తీసుకోవడంలేదో నాకు అర్థం కావడం లేదు. అశ్విన్‌ని ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలాంటప్పుడు అతన్ని ఎందుకు సెలక్ట్ చేస్తారు? ఇది నాకు ఒక ప్రశ్నగా మిగిలింది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-2 ఐదో స్థానంలో నిలిచిన భారత్ సెమీస్ ఆశలు గల్లంతు చేసుకుంది. చదవండి: వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్ గాంధీ -
రహానే, పుజారాలపై వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు..
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌లో భారత్ ఓటమిపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తనదైన శైలిలో విశ్లేషించారు. ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి స్ర్టైక్ రేట్పైనా పలువురు వేలెత్తిచూపడంతో పాటు ఈ టూర్లో విరాట్ కోహ్లీ ఫాంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాట్స్మెన్లు తరచూ స్ర్టైక్ రొటేట్ చేయకపోవడం సమస్యలకు కారణమని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు. ఎక్కువ సమయం క్రీజ్‌లోకి రాకుండా ఉంటే నాన్ స్ర్టైకర్ తన బ్యాటింగ్ రిథమ్‌ను కోల్పోతాడని అన్నారు. రహానే క్రీజ్ వద్ద కుదురుకుని భారీ స్కోర్ నమోదు చేసేందుకు ప్రయత్నించాలని వ్యాఖ్యానించారు. ‘పుజారా చాలా పరుగులు చేశాడు..అయితే అతను స్ర్టైక్ రొటేట్ చేయడంపై దృష్టిసారించాలి..లేకుంటే తన బ్యాటింగ్ భాగస్వామి ఇబ్బందుల్లో పడతాడ’ని పేర్కొన్నారు. మరోవైపు భారత బ్యాట్స్మెన్లు క్రీజులో కుదురుకోకుండా కివీస్ బౌలర్లు కట్టడి చేశారని ప్రశంసించారు. చదవండి : సమం చేస్తారా? -
గావస్కర్: ఇంగ్లండ్, వెంగ్‌సర్కార్: ఇండియా
ముంబై: త్వరలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఆతిథ్య దేశం ఇంగ్లండ్ గెలుచుకుంటుందని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడగా... కోహ్లి సారథ్యంలోని భారత జట్టే ఈ మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్‌ను కైవసం చేసుకుంటుందని మరో మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన ‘టి20 ముంబై లీగ్’ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గావస్కర్ మాట్లాడుతూ 2015 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్ జట్టు పటిష్టమైన వన్డే జట్టుగా ఎదిగిందని సన్నీ విశ్లేషించాడు. సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం కాబట్టి ఆ జట్టు ప్రపంచకప్‌ను అందుకునే అవకాశాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయని వివరించాడు. అయితే భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ మాత్రం కోహ్లి సేనకే తన మద్దతు తెలిపాడు. ప్రపంచ కప్ గెలిచేందుకు భారత్‌కిదే అద్భుత అవకాశమని అన్నాడు. ‘ఈ టోర్నీలో భారత జట్టే ఫేవరేట్. కోహ్లి సేనకే టైటిల్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్లంతా మంచి ఫామ్ఉన్నారు’ అని వెంగీ అన్నాడు. -
నాడు కోహ్లిని ధోని వద్దన్నాడు: వెంగ్‌సర్కార్
ముంబై: ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని 2008లో జట్టులోకి ఎంపిక చేసిన కారణంతో తాను పదవి కోల్పోయానని అంటున్నాడు నాటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్. కోహ్లిని తీసుకోవడం నాటి కెప్టెన్ ధోని, కోచ్ కిర్‌స్టెన్‌లకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. వీరిద్దరితో పాటు నాడు బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్ తమిళనాడు ఆటగాడు బద్రీనాథ్ కోసం పట్టుబట్టారని వివరించాడు. ‘కోహ్లి అండర్–19 ప్రపంచకప్ గెలవడంతో ఆస్ట్రేలియాలో అండర్–23 వర్ధమాన ఆటగాళ్ల టోర్నీకి అతడిని ఎంపిక చేశాం. కోహ్లి ఓపెనర్‌గా వచ్చి çన్యూజిలాండ్ జట్టుపై 123 పరుగులు చేశాడు. దీంతో అతడు టీమిండియాలోకి రావడానికి శ్రీలంక సిరీసే సరైనదిగా భావించాం. అయితే... కోహ్లి ప్రతిభ పూర్తిగా తెలియని కిర్‌స్టెన్, ధోని దీనిని వ్యతిరేకించారు. తమ చెన్నై ఫ్రాంచైజీ బ్యాట్స్‌మన్ బద్రీనాథ్‌ను పక్కన బెట్టాల్సి వస్తుండటంతో ధోని, శ్రీనివాసన్ కూడా ఇష్టపడలేదు. ఆ ఏడాది 800 పరుగులు చేసిన బద్రీనాథ్ సంగతేంటని శ్రీనివాసన్ వాదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నన్ను పదవి నుంచి తప్పించారు. -
ఓటమికి బీసీసీఐదే పూర్తి బాధ్యత!
ముంబై :ఇంగ్లండ్ లో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-1 తేడాతో కోల్పోవడానికి బీసీసీఐదే పూర్తి బాధ్యతని భారత మాజీ ఆటగాడు వెంగసర్కార్ మండిపడ్డాడు. అసలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టెస్ట్ క్రికెట్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించాడు. విదేశాల్లో భారత జట్టు పాల్గొనే మ్యాచ్ ల కోసం సరైన ప్రణాళిక లేదన్నాడు. ఈ కారణంతోనే తాజా వైఫల్యం అని వెంగీ పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టాలని సూచించాడు. అవసరమైతే కొంతమంది ఆటగాళ్లను జట్టును తొలిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఈ ఓటమికి ఒక కెప్టెన్ ధోనినే బాధ్యుణ్ని చేయడం తగదన్నాడు. టీమిండియా అత్యధిక విజయాల్లో ధోని గెలుపును మరవకూడదని వెంగీ పేర్కొన్నాడు. అసలు ఈ వైఫల్యానికి బీసీసీఐదే పూర్తి బాధ్యత వహించాలన్నాడు. ఒక సుదీర్ఘమైన టూర్ కు వెళ్లే ముందు సరైన ప్రణాళిక ఉండాలన్నాడు.అది సరిగా అవలంభించకే తొలుత ఆధిక్యంలో ఉన్నా.. ఓటమి చవిచూశామన్నాడు. -
భారత బౌలర్లకు సవాలే
ముంబై: వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ భారత బౌలర్లకు సవాలేనని మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నారు. టెస్టులో ఇంగ్లండ్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసే నైపుణ్యం భారత బౌలర్లలో లేదని అభిప్రాయపడ్డారు. ఈ నెలఖారులో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత బౌలింగ్ విభాగానికి ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించనున్నారు. భారత బృందంలో మహమ్మద్ షమీ, వరుణ్ అరోన్, అశ్విన్ ఇతర కీలక బౌలర్లు. స్వదేశంలో ఇంగ్లండ్ బలమైన జట్టని వెంగ్‌సర్కార్ అన్నాడు. ఇంగ్లండ్‌ను రెండుసార్లు అవుట్ చేయగల బౌలర్లు భారత జట్టులో లేరని, అయినా ధోనీసేన రాణించాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. -
పాక్‌పై గెలిస్తే కారు ఇస్తానని దావూద్ అన్నాడు: వెంగ్‌సర్కార్