ముంబై: వచ్చే నెలలో ఇంగ్లండ్తో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ భారత బౌలర్లకు సవాలేనని మాజీ కెప్టెన్ వెంగ్సర్కార్ అన్నారు. టెస్టులో ఇంగ్లండ్ను రెండుసార్లు ఆలౌట్ చేసే నైపుణ్యం భారత బౌలర్లలో లేదని అభిప్రాయపడ్డారు. ఈ నెలఖారులో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఇంగ్లండ్తో సిరీస్లో భారత బౌలింగ్ విభాగానికి ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించనున్నారు. భారత బృందంలో మహమ్మద్ షమీ, వరుణ్ అరోన్, అశ్విన్ ఇతర కీలక బౌలర్లు. స్వదేశంలో ఇంగ్లండ్ బలమైన జట్టని వెంగ్సర్కార్ అన్నాడు. ఇంగ్లండ్ను రెండుసార్లు అవుట్ చేయగల బౌలర్లు భారత జట్టులో లేరని, అయినా ధోనీసేన రాణించాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు.
భారత బౌలర్లకు సవాలే
Published Fri, Jun 6 2014 6:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement