కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, మరికొన్ని కొత్త ఆశయాలు... ప్రపంచాన్ని గెలిచేందుకు, ప్రపంచానికి పరిచయమయ్యేందుకు మీ కోసమే అంటూ ఎన్నో వేదికలు, మరెన్నో ఆహ్వానాలు... క్రీడాకారులు అద్భుతాలు సృష్టించేందుకు ప్రతీ ఏడూ కొత్త రూపంలో అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. గత పరాజయాలను మరచి విజయాల వైపు దూసుకెళ్లేవారు కొందరైతే, సాధించిన ఘనతలతో సరిపెట్టుకోకుండా ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసేవారు మరికొందరు. అలాంటి క్షణాలను ఆస్వాదిస్తూ ఆటగాళ్ల గెలుపును తమ గెలుపుగా భావించే అభిమానులందరి కోసం కొత్త సంవత్సరం పసందైన క్రీడా సమరాలతో సిద్ధంగా ఉంది.
క్రికెట్‌లో మన పదునేమిటో చూపించేందుకు దక్షిణాఫ్రికా నుంచి మొదలు పెట్టి ఇంగ్లండ్, ఆపై ఆస్ట్రేలియా వరకు మూడు కఠిన పర్యటనలు.
క్రికెట్
జనవరి 5–9: భారత్–దక్షిణాఫ్రికా, తొలి టెస్టు (కేప్‌టౌన్)
జనవరి 13–17: భారత్–దక్షిణాఫ్రికా, రెండో టెస్టు (సెంచూరియన్)
జనవరి 24–28: భారత్–దక్షిణాఫ్రికా, మూడో టెస్టు (జోహన్నెస్‌బర్గ్)
జనవరి 27–28: బెంగళూరులో ఐపీఎల్–11 వేలం కార్యక్రమం
ఫిబ్రవరి 1: భారత్–దక్షిణాఫ్రికా, తొలి వన్డే (డర్బన్)
ఫిబ్రవరి 4: భారత్–దక్షిణాఫ్రికా, రెండో వన్డే (సెంచూరియన్)
ఫిబ్రవరి 7: భారత్–దక్షిణాఫ్రికా, మూడో వన్డే (కేప్‌టౌన్)
ఫిబ్రవరి 10: భారత్–దక్షిణాఫ్రికా, నాలుగో వన్డే (జోహన్నెస్‌బర్గ్)
ఫిబ్రవరి 13: భారత్–దక్షిణాఫ్రికా, ఐదో వన్డే (పోర్ట్ ఎలిజబెత్)
ఫిబ్రవరి 16: భారత్–దక్షిణాఫ్రికా, ఆరో వన్డే (సెంచూరియన్)
ఫిబ్రవరి 18: భారత్–దక్షిణాఫ్రికా, తొలి టి20 (జోహన్నెస్‌బర్గ్)
ఫిబ్రవరి 21: భారత్–దక్షిణాఫ్రికా, రెండో టి20 (సెంచూరియన్)
ఫిబ్రవరి 24: భారత్–దక్షిణాఫ్రికా, మూడో టి20 (కేప్‌టౌన్)
మార్చి 8–20: శ్రీలంకలో టి20 ముక్కోణపు టోర్నీ (భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్)
ఏప్రిల్ 4–మే 27: ఐపీఎల్–2018
జూలై 3: భారత్–ఇంగ్లండ్, తొలి టి20 (మాంచెస్టర్)
జూలై 6: భారత్–ఇంగ్లండ్, రెండో టి20 (కార్డిఫ్)
జూలై 8: భారత్–ఇంగ్లండ్, మూడో టి20 (బ్రిస్టల్)
జూలై 12: భారత్–ఇంగ్లండ్, తొలి వన్డే (నాటింగ్‌హమ్)
జూలై 14: భారత్–ఇంగ్లండ్, రెండో వన్డే (లార్డ్స్)
జూలై 17: భారత్–ఇంగ్లండ్, మూడో వన్డే (లీడ్స్)
ఆగస్టు 1–5: భారత్–ఇంగ్లండ్, తొలి టెస్టు (బర్మింగ్‌హమ్)
ఆగస్టు 9–13: భారత్–ఇంగ్లండ్, రెండో టెస్టు (లార్డ్స్)
ఆగస్టు 18–22: భారత్–ఇంగ్లండ్, మూడో టెస్టు (నాటింగ్‌హమ్)
ఆగస్టు 30–సెప్టెంబర్ 3: భారత్–ఇంగ్లండ్, నాలుగో టెస్టు (సౌతాంప్టన్)
సెప్టెంబర్ 7–11: భారత్–ఇంగ్లండ్, ఐదో టెస్టు (లండన్)
సెప్టెంబర్: ఆసియా కప్ (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, క్వాలిఫయర్)
అక్టోబర్–నవంబర్: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన (3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టి20)
నవంబర్–డిసెంబర్: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన (4 టెస్టులు)
Comments
Please login to add a commentAdd a comment