ఓటమికి బీసీసీఐదే పూర్తి బాధ్యత!
ముంబై :ఇంగ్లండ్ లో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-1 తేడాతో కోల్పోవడానికి బీసీసీఐదే పూర్తి బాధ్యతని భారత మాజీ ఆటగాడు వెంగసర్కార్ మండిపడ్డాడు. అసలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టెస్ట్ క్రికెట్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించాడు. విదేశాల్లో భారత జట్టు పాల్గొనే మ్యాచ్ ల కోసం సరైన ప్రణాళిక లేదన్నాడు. ఈ కారణంతోనే తాజా వైఫల్యం అని వెంగీ పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టాలని సూచించాడు. అవసరమైతే కొంతమంది ఆటగాళ్లను జట్టును తొలిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
ఈ ఓటమికి ఒక కెప్టెన్ ధోనినే బాధ్యుణ్ని చేయడం తగదన్నాడు. టీమిండియా అత్యధిక విజయాల్లో ధోని గెలుపును మరవకూడదని వెంగీ పేర్కొన్నాడు. అసలు ఈ వైఫల్యానికి బీసీసీఐదే పూర్తి బాధ్యత వహించాలన్నాడు. ఒక సుదీర్ఘమైన టూర్ కు వెళ్లే ముందు సరైన ప్రణాళిక ఉండాలన్నాడు.అది సరిగా అవలంభించకే తొలుత ఆధిక్యంలో ఉన్నా.. ఓటమి చవిచూశామన్నాడు.