ధోని తప్పుకుంటే ఆ బాధ్యతను మోసేదెవరు?
ఇంగ్లండ్ లోని భారత్ పేలవమైన ప్రదర్శనకు కెప్టెన్ కు మహేందర్ సింగ్ ధోని రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ మాజీ ఆటగాళ్లు మద్దతు పలుకుతున్నారు. లార్డ్స్ టెస్టు అనంతరం ఇంగ్లండ్ లో భారత్ ప్రదర్శన పేలవంగా ఉన్నా ధోనిని టెస్టు కెప్టెన్సీ నుంచి తొలిగిస్తారని తాను అనుకోవడం లేదని మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారీ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ పేలవమైన ప్రదర్శనపై ధోని సారథ్య బాధ్యతలను తప్పుకున్నట్లు వార్తలు రావడంతో శ్రీకాంత్ పై విధంగా స్పందించాడు. భారత జట్టుకు అనుభవం లేకే ఇంగ్లండ్ టూర్ లో విఫలమైందన్నవ్యాఖ్యలతో శ్రీకాంత్ విభేదించాడు. ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల అనుభవానికి కొదవలేదన్నాడు. కనీసం ఏడుగురు, ఎనిమింది ఆటగాళ్లు అనుభవం ఉన్నా.. పోరాట పటిమలో నైరాశ్యతే ఘోర వైఫల్యానికి కారణమన్నాడు. శ్రీకాంత్ వ్యాఖ్యలతో భారత మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాధ్ ఏకీభవించాడు.
ధోనిని కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. భారత ఆటగాళ్లు తమ ఆటతీరును పూర్తిగా ప్రదర్శించకపోవడంతోనే ఓటమి చెందారన్నాడు. కాగా, వారి బ్యాటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయన్నాడు. ఓ తల్లి మాదిరిగా కోచ్ వారి ఆటతీరును సరిదిద్దాలని సూచించాడు. భారత్ కు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి విరాట్ కోహ్లి అనుభవం సరిపోదని విశ్వనాధ్ స్సష్టం చేశాడు.అసలు ధోని కెప్టెన్ వైదొలిగితే ఆ బాధ్యతలు మోసేది ఎవరని ప్రశ్నించాడు.