gundappa viswanath
-
దంచికొట్టిన జైస్వాల్.. సొంతగడ్డపై అరుదైన రికార్డు
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. అవసరమైనపుడు దూకుడుగా ఆడుతూనే నిలకడ ప్రదర్శించాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(8) తక్కువ స్కోరుకే అవుటైనా.. తాను మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు.41 బంతుల్లోనే హాఫ్ సెంచరీకివీస్ జట్టు విధించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. యశస్వి జైస్వాల్ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా.. ఏమాత్రం తొణక్కుండా ధనాధన్ ఇన్నింగ్స్‌తో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో మూడుసార్లు లైఫ్ పొందిన యశస్వి 65 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించాడు.సెంచరీ చేయకుండానే..అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్ వేసిన కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ యశస్విని అద్భుత బంతితో అవుట్ చేశాడు. సాంట్నర్ వేసిన టాప్‌క్లాస్ బాల్‌ను బాగానే టాకిల్ చేసినా.. దురదృష్టవశాత్తూ పూర్తిస్థాయిలో షాట్ కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో బంతి వెళ్లి ఫీల్డర్ డారిల్ మిచెల్ చేతుల్లో పడింది. ఫలితంగా సెంచరీ చేయకుండానే యశస్వి జైస్వాల్(77) నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(8), శుబ్‌మన్ గిల్(23), రిషభ్ పంత్(0- రనౌట్), యశస్వి జైస్వాల్ రూపంలో కివీస్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో శనివారం నాటి మూడోరోజు ఆటలో 25 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా విజయానికి 225 పరుగుల దూరంలో ఉంది.క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై ఇలాకాగా శనివారం నాటి ఆటలో యశస్వి జైస్వాల్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏడో బ్యాటర్(మూడో భారత క్రికెటర్)గా నిలిచాడు.అంతకు ముందు ఈ ఘనత సాధించిన క్రికెటర్లుగుండప్ప విశ్వనాథ్(1979)- 1047 పరుగులుసునిల్ గావస్కర్(1979)- 1013 పరుగులుగ్రాహం గూచ్(1990)- 1058 పరుగులుజస్టిన్ లాంగర్(2004)-1012 పరుగులుమహ్మద్ యూసఫ్(2006)- 1126 పరుగులుమైఖేల్ క్లార్క్(2012)- 1407 పరుగులుయశస్వి జైస్వాల్(2024)- 1055* పరుగులు.చదవండి: Ind vs Aus: నాలుగు వరుస శతకాలు.. టీమిండియాలో చోటు! ఓపెనర్‌గా ఫిక్స్! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
‘రహానే తప్పుకుంటే మంచిది’
బెంగళూరు : అఫ్గానిస్తాన్‌తో జరిగిన చారిత్రక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌డౌన్‌లో చతేశ్వర పుజారా బదులు కేఎల్ రాహుల్‌ను పంపడంపై టీమిండియా మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ తప్పుబట్టారు. టెస్టుల్లో మూడు, నాలుగు బ్యాటింగ్ స్థానాలు ఎంతో కీలకమైనవని, వాటిపై ఎప్పుడూ ప్రయోగాలు చేయకూడదని సూచించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని టెస్టు సిరీస్‌లలోనూ మూడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా పుజారా అద్భుతంగా రాణిస్తున్నాడని, జులైలో కీలక ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం టీమిండియాకు మంచిది కాదన్నారు. అఫ్గాన్ టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడి ఉంటే పుజారాను మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపించే వారు కదా అని ప్రశ్నించారు. ఇక పరుగుల చేయడానికి ఆపసోపాలు పడుతున్న అజింక్యా రహానే తప్పుకొని రాహుల్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. కేఎల్ రాహుల్ ఆటలో ఎంతో పరిణితి చెందాడని, అతనికి వరసగా అవకాశాలు కల్పిస్తే ఇంకాస్త మెరుగ్గా రాణిస్తాడని విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. -
'రికార్డులు అనేవి బ్రేక్ చేయడానికే'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన వంద సెంచరీల రికార్డును ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అధిగమించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని దిగ్గజ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. నిలకడ, దూకుడు, ఫామ్ అన్నింటిలోనూ తనదైన మార్కుతో చెలరేగిపోతున్న కోహ్లి..గతంలో ఎవరూ లేనంతగా స్థిరంగా రాణిస్తున్నాడన్నాడు. 'కోహ్లి తరుచూ సెంచరీలు కొడుతున్నాడు. సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం కోహ్లికి పుష్కలంగా ఉంది. రికార్డులు ఉన్నది బ్రేక్ చేయడానికి కదా. ఈ ఘనత కోహ్లి సాధిస్తే నేనెంతో సంతోషిస్తా. సచిన్ కూడా తప్పకుండా ఆనంద పడతాడు. అయితే విరాట్ ఈ రికార్డు బద్దలు కొట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది. కోహ్లిని ఎవరితో పోల్చడం నాకిష్టం లేదు' అని విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇటీవల విరాట్ నేతృత్వంలో సాధించిన విజయాల్లో ఉప ఖండంలోనే ఎక్కువగా ఉన్నాయన్న విశ్వనాథ్.. టీమిండియా తన దక్షిణాఫ్రికా పర్యటనలో అమోఘంగా రాణిస్తుందన్నాడు. ఇదే విజయపరంపర మిగతా దేశాల్లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
కెప్టెన్‌గా కోహ్లి ఓకే.. కానీ
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలో ఇంకా నిలకడను కనబరచాల్సిన అవసరం ఉందని మాజీ దిగ్గజ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డాడు. 2014, డిసెంబర్ చివర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని నుంచి టెస్టు బాధ్యతలు తీసుకున్న కోహ్లి నాయకుడిగా క్రమేపీ పరిణితి సాధిస్తున్నా... ఆటలో మాత్రం చాలా మెరుగవ్వాలన్నాడు. విరాట్ ఆటలో దూకుడును తగ్గించి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని సూచించాడు. ప్రత్యేకంగా టెస్టుల్లో ఎక్కువగా స్ట్రోక్స్ ఆడి వికెట్ ను అనవసరంగా కోల్పోతున్న విషయాన్ని విరాట్ గుర్తిస్తే బాగుంటుందన్నాడు. అతను కొట్టే స్ట్రోక్స్ ఒకటి, రెండు సార్లు బాగానే ఉంటున్నా... అత్యధిక సార్లు మాత్రం వికెట్లు వెనుక దొరికిపోతున్నాడన్నాడు. ఇది అతని కెరీర్ ను డైలామాలో పాడేసే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. దీన్ని విరాట్ వదిలిపెట్టి బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని విశ్వనాధ్ సూచించాడు. -
ఓటమికి బీసీసీఐదే పూర్తి బాధ్యత!
ముంబై :ఇంగ్లండ్ లో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-1 తేడాతో కోల్పోవడానికి బీసీసీఐదే పూర్తి బాధ్యతని భారత మాజీ ఆటగాడు వెంగసర్కార్ మండిపడ్డాడు. అసలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టెస్ట్ క్రికెట్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించాడు. విదేశాల్లో భారత జట్టు పాల్గొనే మ్యాచ్ ల కోసం సరైన ప్రణాళిక లేదన్నాడు. ఈ కారణంతోనే తాజా వైఫల్యం అని వెంగీ పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దీనిపై తీవ్రంగా దృష్టి పెట్టాలని సూచించాడు. అవసరమైతే కొంతమంది ఆటగాళ్లను జట్టును తొలిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఈ ఓటమికి ఒక కెప్టెన్ ధోనినే బాధ్యుణ్ని చేయడం తగదన్నాడు. టీమిండియా అత్యధిక విజయాల్లో ధోని గెలుపును మరవకూడదని వెంగీ పేర్కొన్నాడు. అసలు ఈ వైఫల్యానికి బీసీసీఐదే పూర్తి బాధ్యత వహించాలన్నాడు. ఒక సుదీర్ఘమైన టూర్ కు వెళ్లే ముందు సరైన ప్రణాళిక ఉండాలన్నాడు.అది సరిగా అవలంభించకే తొలుత ఆధిక్యంలో ఉన్నా.. ఓటమి చవిచూశామన్నాడు. -
ధోని తప్పుకుంటే ఆ బాధ్యతను మోసేదెవరు?
ఇంగ్లండ్ లోని భారత్ పేలవమైన ప్రదర్శనకు కెప్టెన్ కు మహేందర్ సింగ్ ధోని రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ మాజీ ఆటగాళ్లు మద్దతు పలుకుతున్నారు. లార్డ్స్ టెస్టు అనంతరం ఇంగ్లండ్ లో భారత్ ప్రదర్శన పేలవంగా ఉన్నా ధోనిని టెస్టు కెప్టెన్సీ నుంచి తొలిగిస్తారని తాను అనుకోవడం లేదని మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారీ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ పేలవమైన ప్రదర్శనపై ధోని సారథ్య బాధ్యతలను తప్పుకున్నట్లు వార్తలు రావడంతో శ్రీకాంత్ పై విధంగా స్పందించాడు. భారత జట్టుకు అనుభవం లేకే ఇంగ్లండ్ టూర్ లో విఫలమైందన్నవ్యాఖ్యలతో శ్రీకాంత్ విభేదించాడు. ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల అనుభవానికి కొదవలేదన్నాడు. కనీసం ఏడుగురు, ఎనిమింది ఆటగాళ్లు అనుభవం ఉన్నా.. పోరాట పటిమలో నైరాశ్యతే ఘోర వైఫల్యానికి కారణమన్నాడు. శ్రీకాంత్ వ్యాఖ్యలతో భారత మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాధ్ ఏకీభవించాడు. ధోనిని కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. భారత ఆటగాళ్లు తమ ఆటతీరును పూర్తిగా ప్రదర్శించకపోవడంతోనే ఓటమి చెందారన్నాడు. కాగా, వారి బ్యాటింగ్ లో చిన్న చిన్న లోపాలున్నాయన్నాడు. ఓ తల్లి మాదిరిగా కోచ్ వారి ఆటతీరును సరిదిద్దాలని సూచించాడు. భారత్ కు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి విరాట్ కోహ్లి అనుభవం సరిపోదని విశ్వనాధ్ స్సష్టం చేశాడు.అసలు ధోని కెప్టెన్ వైదొలిగితే ఆ బాధ్యతలు మోసేది ఎవరని ప్రశ్నించాడు.