India Tour Of South Africa: Rohit Sharma To Replace Rahane As India Test Vice Captain - Sakshi
Sakshi News home page

Rohit Sharma: టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ!

Published Sat, Dec 4 2021 8:14 AM | Last Updated on Sat, Dec 4 2021 9:50 AM

Rohit Sharma set to replace Ajinkya Rahane as Indias new test vice captain says Reports - Sakshi

Rohit Sharma set to replace Ajinkya Rahane as Indias new test vice captain:  టీమిండియా టెస్ట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ను ఎంపిక చేసే యోచనలో  బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానేను తప్పించి అతడి స్ధానంలో రోహిత్‌కు అవకాశం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడునున్నట్లు సమాచారం. కగా రోహిత్‌ టీ20 కెప్టెన్సీ భాధ్యతలు చెపట్టిన సంగతి తెలిసిందే. త్వరలో వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా రోహిత్‌కే అందజేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

కగా టెస్ట్‌ల్లో గత రెండేళ్లుగా  అజింక్యా రహానె పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో కివీస్‌తో రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. అతడి చివరి 16 టెస్టుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. మరో వైపు టెస్ట్‌ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన శ్రేయస్‌ అద్బుతంగా రాణిస్తున్నాడు. దీంతో జట్టులో రహానె స్ధానం ప్రశ్నర్ధాకంగా  మారింది.

చదవండి: IND vs NZ: ఐపీఎల్‌లో ఆ అంపైర్‌తో గొడవపడ్డ కోహ్లి.. అందుకే ఔట్ ఇచ్చాడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement